CM Jagan : అవును అప్పులు చేయాల్సిందే..! సీఎం జగన్ సరికొత్త వ్యూహం, తొలిసారి టీడీపీ ఆరోపణలకు కౌంటర్
ఎప్పుడూ విపక్షంపై ఎదురుదాడి చేసే అధికార వైసీపీ తొలిసారిగా తనపై విపక్షం చేస్తున్న విమర్శలకు కారణాలు ఏంటో, ఏ ఉద్దేశంతో ఆ విమర్శలు చేస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల సీఎం జగన్ చేసిన కామెంట్లు. జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైపోతోందని అంటున్నారు.

CM Jagan On AP Debts
ఏపీలో అప్పులే ప్రధాన ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి. ఇటు విపక్షం, అటు అధికార పక్షం అప్పులనే టార్గెట్ గా చేసుకున్నాయి. మీరు ఎక్కువ అప్పులు చేశారు అని అంటే, మీ హయాంలోనే ఎక్కువ అంటూ వాదోపవాదాలకు దిగుతున్నాయి రెండు పార్టీలు. మొత్తానికి రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని అందరూ అంగీకరించేలా వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల్లో ఎవరి వాదన నెగ్గనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇంట్రస్టింగ్ టాపిక్ అవుతున్నాయి.
ఎప్పుడూ విపక్షంపై ఎదురుదాడి చేసే అధికార వైసీపీ తొలిసారిగా తనపై విపక్షం చేస్తున్న విమర్శలకు కారణాలు ఏంటో, ఏ ఉద్దేశంతో ఆ విమర్శలు చేస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల సీఎం జగన్ చేసిన కామెంట్లు. జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైపోతోందని అంటున్నారు.
”మరి చంద్రబాబు చెప్పిన ప్రకారం వారి మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ(పెన్షన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ) అమలు చేయాలంటే జగన్ ఇచ్చేదానికన్నా వారు మరిన్ని అప్పులు చేయాల్సి ఉంటుంది. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు. టీడీపీ హయాంలో చేసిన అప్పులకన్నా మా ప్రభుత్వంలో చేసిన అప్పులు తక్కువే. అదే రాష్ట్రం అదే బడ్జెట్. అప్పుడు కూడా అప్పుల పెరుగుదల అప్పటికన్నా మీ బిడ్డ హయాంలోనే తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడో, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడో ఆలోచన చేయాలి” అని ప్రజలను కోరారు సీఎం జగన్.
Also Read : ఆ ముగ్గురు మాత్రమే సేఫ్..! 10మందిపై వేటు ఖాయం..! అనంత వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ టెన్షన్
అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమ కార్యక్రమాలతో పాలన సాగిస్తున్న సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లుగా విపక్ష టీడీపీని ఇరుకునపెట్టేలా విమర్శలతో ఎదురుదాడి చేసే వారు. కానీ, తొలిసారిగా విపక్ష శిబిరం ఇస్తున్న హామీలను ప్రస్తావిస్తూ, ఆ హామీలను నెరవేర్చాలంటే అప్పులు చేయాల్సిందే కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
”జగన్ ను చూస్తే అప్పుల అప్పారావు గుర్తుకొస్తాడు. ఎన్నికల ముందు అందరికీ ముద్దులు పెట్టి ఒక్క అవకాశం అని అడిగాడు. ప్రజలు ఆశీర్వదించారు. ముఖ్యమంత్రిని చేశారు. ఈరోజు 12లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పుకు అయ్యే పన్ను ప్రతి సంవత్సరం ఒక లక్ష కోట్ల రూపాయలు. సంపదను సృష్టించి సంక్షేమం అందించే విజినరీ నాయకుడు మన లీడర్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి” అంటూ.. నవశకం సభలో టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన ఆరోపణలకు సీఎం జగన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. గతంలో ఎప్పుడూ ఇలా స్పందించని జగన్ తొలిసారిగా తన హయాంలో చేసిన అప్పులపై మాట్లాడటంతో పాటు విపక్ష శిబిరాన్ని ప్రశ్నించడం ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు పరిశీలకులు. ఇలా రెండు పార్టీలు ఒకే అంశంపై తరుచూ మాట్లాడుతుండటంతో వచ్చే ఎన్నికల్లో ఏపీ అప్పులే ప్రధాన అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.
Also Read : జగన్ సంచలన నిర్ణయాలు.. అసలు వ్యూహం ఏంటి? గెలుపుపై అంత ధీమా ఎలా?
ఇదే సమయంలో చంద్రబాబు, జగన్.. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అప్పులు చేశారు అనే చర్చ మొదలైంది. అయితే చంద్రబాబు కన్నా తాను తక్కువే అప్పులు చేశానని చెబుతున్న జగన్.. టీడీపీ మహానాడులో ప్రకటించిన గ్యారెంటీ హామీలను అప్పులు చేయకుండా ఎలా అమలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. సీఎం అలా అనడం వెనుక పథకాలను అమలు చేయాలంటే అప్పులు చేయక తప్పదనే తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం కనిపిస్తోందని చెబుతున్నారు. తాను ప్రజా సంక్షేమం కోసమే అప్పు చేశానని చెప్పుకుంటున్న జగన్.. తన సంక్షేమ కార్యక్రమాలకు ప్రజామోదం పొందేలా, ఆ విధంగా ఎన్నికల్లో విక్టరీ కొట్టేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
మొత్తానికి ఇరు పార్టీలు అప్పుల జపం చేస్తుండటం హాట్ డిబేట్ కు దారితీస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా వచ్చే ఎన్నికల్లో రుణాలతోనే రణం అన్నట్లు మారుతోంది పరిస్థితి. పథకాలు అమలు చేయడానికి అప్పులు అంటున్న అధికార పక్షం, విపక్షం పథకాలకు అప్పులు చేయాల్సిందేనన్న వాదన తీసుకెళ్తుండటం చూస్తే వచ్చే ఐదేళ్లు అప్పుల బాధ, వడ్డీల మోత భరించాల్సిందేనా అంటూ నిట్టూరుస్తున్నారు సామాన్య జనం.