పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను రేప్ చేసిన డ్యాన్స్ మాస్టర్

పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను రేప్ చేసిన డ్యాన్స్ మాస్టర్

Updated On : August 28, 2020 / 7:52 PM IST

డ్యాన్స్  నేర్పిస్తానని చెప్పి.. బాలికను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి రోడ్ మీద వదిలేసి వెళ్లిపోయాడు. అనంతపురం దగ్గర్లోని శెట్టూరు గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి డ్యాన్స్ నేర్పిస్తుంటాడు. ఈ క్రమంలోనే అక్కడ డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.

ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని.. కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పథకం ప్రకారం గురువారం రాము తన ముగ్గురు ఫ్రెండ్స్ సహకారంతో బాలికను శెట్టూరు చెరువుకట్ట సమీపంలోని తాతయ్య గుడి వద్దకు రప్పించాడు. అక్కడి నుంచి టాటాఏస్‌ వాహనంలో కళ్యాణదుర్గం మండలం గోళ్ల ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు తీసుకెళ్లాడు.

ఆలయ సమీపంలోనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను కళ్యాణదుర్గం బైపాస్‌లో బళ్లారి రోడ్డు మిట్టపై వదిలేశాడు. బాలిక తండ్రికి జరిగిందంతా చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.