IIT Team : ఘాట్ రోడ్డులో ప్రమాదకరమైన పరిస్థితులు – ఐఐటీ బృందం హెచ్చరికలు

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఢిల్లీ ఐఐటీ నిపుణులు ప్రొఫెసర్ కేఎస్ రావు, టీటీడీ సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ...

TTD Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డు..ఇతర ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితులున్నాయని ఐఐటీ ప్రొఫెసర్ కేఎస్ రావు హెచ్చరించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయాలంటే…రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. 2021, డిసెంబర్ 02వ తేదీ తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఢిల్లీ ఐఐటీ నిపుణులు ప్రొఫెసర్ కేఎస్ రావు, టీటీడీ సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు.

Read More : Winter : చలికాలంలో చిన్నారులకు ఎలాంటి ఆహారం అందించాలంటే?..

ఇప్పటికే చెన్నై ఐఐటీ బృందం ఘాట్ రోడ్డును పరిశీలించిన సంగతి తెలిసిందే. కొండచరియ పక్కనే మరో భారీ కొండచరియ కూలే అవకాశం ఉందని గుర్తించారు. దీనిని ఎలా తొలగించాలనే దానిపై నిపుణుల నుంచి సలహా తీసుకున్నారు. అత్యధిక వర్షపాతం వల్లే..ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడినట్లు నిపుణులు ప్రొఫెసర్ కేఎస్ రావు తేల్చారు. ఘాట్ రోడ్డులో పడిన వర్షపు నీరు వెళ్లేందుకు అవసరమైన డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు పనులు రెండు రోజుల్లో పూర్తవుతాయని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు.

Read More : Woman Dating Offer : వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్‌కొస్తా..అందాల భామ ఆఫ‌ర్..టీకా వేయించుకోటానికి క్యూ కట్టిన అబ్బాయిలు

మరోవైపు…తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలను తొలగించే పనులు చేపడుతున్నారు. ఎక్కువ భాగం ధ్వంసం కావడంతో..పునరుద్ధరించడానికి కనీసం మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే తిరుమలలో కనీవినీ ఎరుగని వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఘాట్ రోడ్డులోని 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చెరియలు విరిగిపడుతున్న సమయంలో ఓ ఆర్టీసీ బస్సు అక్కడికి చేరుకోగా డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.

ట్రెండింగ్ వార్తలు