Dollar Seshadri : డాలర్ శేషాద్రి కన్నుమూత.. ఉప రాష్ట్రపతి సహా ప్రముఖుల సంతాపం

తిరుమల తిరుపతి దేవస్థానం ఓయస్‌డీ అధికారి పి.శేషాద్రి.. ‘డాలర్’ శేషాద్రి కన్నుమూశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు.

Dollar Seshadri : తిరుమల తిరుపతి దేవస్థానం ఓయస్‌డీ అధికారి పి.శేషాద్రి.. ‘డాలర్’ శేషాద్రి కన్నుమూశారు. వైజాగ్‌లో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన డాల్లర్ శేషాద్రికి 2021, నవంబర్ 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే శేషాద్రి కన్నుమూశారు. ఆయన మృతితో పలువురు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.

Read More : India Petrol : 25 రోజుల నుంచి పెరగని పెట్రో ధరలు, ఏ నగరంలో ఎంతంటే

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. పదవులతో నిమిత్తం లేకుండా…పాతకాలం నుంచి వివిధ హోదాల్లో సేవలు అందించారని, తాను తిరుమలకు వెళ్లినప్పుడల్లా…పక్కనే ఉండి ఆలయ విశేషాలను వివరించే వారని గుర్తు చేసుకున్నారు. శేషాద్రి ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిస్తూ..వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశింకర్ మాస్టర్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. భారతీయ నాట్య సంప్రదాయాలకు, చక్కని అభినయాన్ని జోడించి దాదాపు 10 భారతీయ భాషల్లోని వందలాది చిత్ర గీతాలకు సమకూర్చిన నృత్యరీతులు అభినందనీయమైనవని కొనియాడారు. శివశంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.

Read More : Launch Journey : నాగార్జున సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం..నేటి నుంచి పున:ప్రారంభం

టీటీడీ‎ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమన్నారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. ఉదయాన్నే ఆయన మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన మృతి టీటీడీకి తీరనిలోటుగా అభివర్ణించారు. డాలర్ శేషాద్రి నిత్యం వేంకటేశ్వర స్వామి సేవలో తరించేవారని, ఆయన టీటీడికి విశేషమైన సేవలందించారు. శేషాద్రి తన చివరి క్షణంలోను స్వామి వారి సేవకు పాటుపడుతూ కన్నుమూశారని, ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియచేశారు.

Read More : AP Floods : ఏపీలో వరదలు..కేంద్ర బృందంతో సీఎం జగన్ భేటీ

తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న శ్రీపాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీకి తీరని లోటన్నారు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి. వైజాగ్ లో టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి స్వామి వెళ్ళారని, శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారన్నారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్యజీవి అన్నారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారని, ఆయన మరణ వార్త తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు