Pawan Kalyan
Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఈ సందర్భంగా ఎన్డీయే అభ్యర్థుల తరపున ఎన్టీయే కూటమిలోని పార్టీల నేతలు ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మహారాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 16, 17 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.. ఈ క్రమంలో ఆయన ఐదు సభలు, రెండు రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది.
16వ తేదీన ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో తలపెట్టిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తరువాత లాతూర్ లో మరో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6గంటలకు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పవన్ పాల్గొంటారు.
17వ తేదీన ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగే రోడ్ షోలో పాల్గొని, అనంతరం కస్బాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు.
ఎన్.డి.ఏ. అభ్యర్థులకు మద్దతుగా శ్రీ @PawanKalyan గారు మహారాష్ట్రలో ప్రచారం
రెండు రోజులపాటు మహారాష్ట్ర పర్యటన
5 సభలు… 2 రోడ్ షోలు pic.twitter.com/4IPDDcwSwO
— JanaSena Party (@JanaSenaParty) November 15, 2024