YS Viveka Case : 10టీవీ చేతిలో దస్తగిరి సీబీఐ అధికారులకు ఇచ్చిన 160 CRPC స్టేట్‌మెంట్ కాపీ..
YS వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం అయిన క్రమంలో రోజుకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సీబీఐ అధికారులకు ఇచ్చిన 160 CRPC స్టేట్ మెంట్ కాపీ 10టీవీ చేతికి అందింది.

ys viveka case.. dastagiri cbi 160 CRPC
YS Viveka Case : YS వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం అయిన క్రమంలో రోజుకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సీబీఐ అధికారులకు ఇచ్చిన 160 CRPC స్టేట్ మెంట్ కాపీ 10టీవీ చేతికి అందింది. ఈకాపీలో దస్తగిరి చాలా క్లియర్ గా సీబీఐకు ఇచ్చిన వివరాలు ఉన్నాయి.హత్య కేసుకు సంబంధించిన వివరాలను చాలా క్లియర్ గా వెల్లడించాడు దస్తగిరి..
నవంబర్ 2028నాటికి బెంగళూరులో ల్యాండ్ సెటిల్ మెంట్ పూర్తి అయ్యింది..
డబ్బు కలెక్ట్ చేసుకోవటానికి బెంగళూరు వెళ్లిన వివేకా,దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి..
రూ.8కోట్లలో గంగిరెడ్డి వివేకాను 50శాతం వాటా అడిగాడు..
వాటా అడగటంతో వివేకా గంగిరెడ్డిపై ఆగ్రహం
ఈ ల్యాండ్ సెటిల్ మెంట్ గంగిరెడ్డి షేర్ అడగగా నన్నే షేర్ అడిగేంత వాడివి అయ్యావా? అని తిట్టిన వివేకా..
హత్య చేసేముందు కూడా నా షేర్ డబ్బు నాకు ఇవ్వాలని వివేకాను గంగిరెడ్డి అడిగాడు..
సీబీఐ విచారణలో ఇలాంటి పలు కీలక విషయాలను వెల్లడించాడు దస్తగిరి ప్రస్తుతం కడపజిల్లాలోనే ఉంటున్నారు. ఈక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సీఎం జగన్ వల్ల తనకు ప్రాణహాని ఉందని కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అవినాశ్ రెడ్డి అనుచరులు తనను అనుసరిస్తున్నారని తనను చంపేస్తారని కాబట్టి భద్రత కావాలని కోరారు. అవనాశ్ తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్టు తర్వాత తనపై కక్ష కట్టారని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వాపోయాడు. తనను, తన కుటుంబాన్ని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను వైఎస్ సునీత వద్ద భారీగా డబ్బులు తీసుకుని సీబీఐకు తప్పుడు సమాచారం ఇచ్చానని అవినాశ్ పదే పదే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని..నేను డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. తాను డబ్బులు తీసుకున్నట్లుగా నిరూపిస్తే జైలుకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నానని నిరూపించకపోతే అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి జైలుకు వెళ్లటానికి సిద్దంగా ఉన్నారా? అని సవాల్ విసిరాడు.
వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ వాస్తవాలను బయటపెట్టేలా జరగాలని తాను కోరుకుంటున్నాని దస్తగిరి చెప్పాడు. తాను హత్యలో పాత్రధారిగానే ఉన్నానని కానీ పశ్చాత్తాపంతో అప్రూవర్ గా మారానని హత్య విషయంలో జరిగిన విషయాలు అన్నీ సీబీఐకు చెప్పానని అప్పటినుంచి తనపై అవినాశ్ రెడ్డి కక్ష కట్టారని తను వారినుంచి ప్రాణహాని ఉందని ఇప్పటికే దానిపై కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి భద్రతో కోరానని చెప్పాడు. అలాగే సీబీఐ ఎస్పీ, కడప ఎస్పీ, రాయలసీమ రేంజ్ డీఐజీకి రిజిస్టర్ పోస్టు ద్వారా వినతులు అందజేస్తానని దస్తగిరి చెప్పిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తమను సీబీఐ నిందితులుగా మార్చడాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేయటం..ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేయటం..దీనిపై విచారించిన హైకోర్టు బెయిల్ ఇవ్వకుండానే ఏప్రిల్ 24వరకు అరెస్ట్ చేయవద్దని చెప్పటం దీనిపై వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేయటం..సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టే చేయటం వంటి పలు కీలక పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 25న అవినాశ్ రెడ్డి అరెస్ట్ అనివార్యమా?లేదా ఏం జరుగనుంది? అనే విషయాలు పలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.