Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమాకు కరోనా పాజిటివ్

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. 'డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా కలిసిన వారు కోవిడ్ పరీక్షలు.

Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమాకు కరోనా పాజిటివ్

Devineni Uma

Updated On : January 18, 2022 / 9:29 AM IST

Devineni Uma: మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. ‘డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా’ అని వెల్లడించారు.

మంగళవారం జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో చంద్రబాబు పాల్గొనాల్సి ఉండగా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా సోమవారం కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.

మరోవైపు టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించుకుంది.

ఇది కూడా చదవండి: మాజీ సీఎం చంద్రబాబుకు కొవిడ్ పాజిటివ్