Annavaram : అన్నవరం సత్యదేవునికి రూ..1.5 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని కానుకగా ఇచ్చిన భక్తుడు
అన్నవరం సత్యదేవునికి రూ.1.50 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని కానుకగా ఇచ్చిన భక్తుడు. రూ.1.50 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటాన్ని కానుకగా సమర్పించాడు.కోరిన కోరికలు తీర్చే అన్నవరం సత్యనారాయణ స్వామికి వజ్రాల శోభతో మెరిసిపోనున్నాడు. అన్నవరం సత్యదేవునికి ఓ భక్తుడు వజ్రాల కిరిటాన్ని కానుకగా ఇచ్చాడు.

Diamond Crown For Annavaram Satyanarayana Swamy
diamond crown for annavaram satyanarayana swamy : అన్నవరం సత్యదేవునికి రూ.1.5 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని కానుకగా ఇచ్చిన భక్తుడు. దీంతో కోరిన కోరికలు తీర్చే అన్నవరం సత్యనారాయణ స్వామికి వజ్రాల శోభతో మెరిసిపోనున్నాడు. అన్నవరం సత్యదేవునికి ఓ భక్తుడు వజ్రాల కిరిటాన్ని కానుకగా ఇచ్చాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రాంతానికి చెందిన ఓ భక్తుడు రూ.1.50 కోటీ విలువైన వజ్రాల కిరీటాన్ని కానుకగా సమర్పించాడు.682.230 గ్రాముల బంగారం,114.41 క్యారెట్ల వజ్రాలు, 14.97 క్యారెట్ల కెంపులు..పచ్చలతో కూడిన వజ్రాల కిరీటాన్ని స్వామివారికి కానుకగా ఇచ్చాడు. ఈ వజ్ర కిరీటాన్ని స్వామివారికి అలంకరించనున్నారు.
రత్నగిరిపై కొలువైన రత్నగిరీశుడు..
రత్నగిరి కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం చూడటానికి రెండు కళ్లూ చాలవు. ప్రకృతి ఒడిలో పవళించిన సత్యదేవుని చెంతకు భక్తులు తండోపతండాలుగా వస్తారు.అన్నవరం – పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో కొలువైఉన్నాడు. ఈ ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము పైగా మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. ఆలయ సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు.
సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత. ఆవేడుక చూచి తీరవలసిన సుందర దృశ్యం. ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) “అన్నవరం దేవుడు” అంటారు.