Vizag Beach: విశాఖ బీచ్‌లో మళ్ళీ కనువిందు చేసిన డాల్ఫిన్‌‌లు!

విశాఖ తీరంలో మరోసారి డాల్ఫిన్‌ లు సందడి చేస్తున్నాయి. ఆ మధ్య వైజాగ్ రుషికొండలోని లివిన్‌ అడ్వెంచర్‌ సంస్థకు చెందిన స్కూబా డైవర్లు స్పీడ్‌ బోట్‌లో తీరం నుంచి సుమారు మైలు దూరం..

Vizag Beach

Vizag Beach: విశాఖ తీరంలో మరోసారి డాల్ఫిన్‌ లు సందడి చేస్తున్నాయి. ఆ మధ్య వైజాగ్ రుషికొండలోని లివిన్‌ అడ్వెంచర్‌ సంస్థకు చెందిన స్కూబా డైవర్లు స్పీడ్‌ బోట్‌లో తీరం నుంచి సుమారు మైలు దూరం సముద్రంలోకి వెళ్లగానే డాల్ఫిన్లు కనిపించాయి. 15కుపైగా డాల్ఫిన్లు అలలతో పోటీపడుతున్నట్లు ఎగురుతూ సందడి చేశాయి. ఈ దృశ్యాలను లివిన్‌ అడ్వెంచర్స్‌ ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించగా అప్పుడు ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అంతకు రెండు నెలల ముందు కూడా ఒకసారి ఇలా కనిపించాయి.

Skirts for Boys: స్కూల్‌కి స్కర్ట్స్ వేసుకొచ్చిన అబ్బాయిలు.. ఎందుకంటే?

సాధారణంగా డాల్ఫిన్‌లు సముద్రంలోని లోతైన ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఇవి చాలా అరుదుగా తీరం సమీపంలోకి వస్తుంటాయని చెబుతారు. అయితే, వైజాగ్ తీరంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో బోట్లకు తగిలి ఇవి చనిపోతూ అంతరించిపోవడంతో తీరంవైపు రావడమే మానేశాయి. అందుకే డాల్ఫిన్లు మళ్ళీ విశాఖ సాగర తీరంలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. రెండు నెలల క్రితం తీరం నుండి మైలు దూరంలో కనిపించిన డాల్ఫిన్ ఇప్పుడు ఏకంగా తీరానికి కొట్టుకువచ్చింది.

Yamuna River : మంచు కాదు..పాలపొంగులు కావు..మరేంటి ?

తాజాగా విశాఖ సాగర తీరంలో డాల్ఫిన్ సందడి చేసింది. విశాఖపట్నం నుంచి వెళ్లే మార్గంలో తీరానికి డాల్ఫిన్ కొట్టుకురాగా ప్రాణం ఉందని గమనించిన స్థానికులు తిరిగి సముద్రంలోకి పంపించారు. అయితే, డాల్ఫిన్ తీరానికి రావడంతో ఆ సమయంలో బీచ్లో ఉన్న సందర్శకులు ఆసక్తిగా గమనించారు. డాల్ఫిన్ ఇంత దగ్గరగా కనిపించే సరికి దాన్ని చూసేందుకు అంతా ఎగబడ్డారు. అయితే, అప్పటికీ దానికి ప్రాణం ఉండడంతో కొందరు దాన్ని మళ్ళీ సముద్రంలోకి విడిచిపెట్టారు. కాగా, ఇది కూడా స్పీడ్ బోట్ తగిలే ఇలా తీరానికి వచ్చిన ఉంటుందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.