Yamuna River : మంచు కాదు..పాలపొంగులు కావు..మరేంటి ?

ఒకప్పుడు యమునా తీరాన.. సాయంకాల వేళ.. సేదదీరడానికి తరలిన ప్రజలు ఇప్పుడు ఆ వైపునకు చూడాలన్న భయపడాల్సిన పరిస్థితి.

Yamuna River : మంచు కాదు..పాలపొంగులు కావు..మరేంటి ?

Chhat Puja

Yamuna River Chhat Puja: హిమగిరుల్లో కరుగుతున్న మంచు పలకలు కావివి..! ఆకాశగంగలో పాలపొంగులు కావివి..! నీలి నింగిలో మేఘాలు కావివి..! యమునా తీరాన నల్లటి నీటిలో తెల్లగా తేలియాడుతున్న విషపు నురగలు ఇవి..! ఒకప్పుడు యమునా తీరాన.. సాయంకాల వేళ.. సేదదీరడానికి తరలిన ప్రజలు ఇప్పుడు ఆ వైపునకు చూడాలన్న భయపడాల్సిన పరిస్థితి. ఛాత్‌ పూజ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు మహిళలు. ఆ మురుగు నీటిలోనే పూజలు చేస్తున్నారు.

Read More : Police lathi-charge: అనంతపురంలో విద్యార్థులపై విరిగిన లాఠీ.. విద్యార్థినికి పగిలిన తల

భారత్‌లోని ముఖ్యమైన నదుల్లో ఒకటైన యమునా నదిలో ప్రతి సంవత్సరం పెద్దయెత్తున విషపూరితమైన నురగ ఏర్పడుతోంది. నీటిలోని ప్రాణులకు, పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగిస్తోంది. ఈ నురగ ఎలా ఏర్పడుతోంది? పారిశ్రామిక వ్యర్థాలు, శుద్ధిచేయని ఇతర వ్యర్థాలే ఈ నురగకు మూల కారణం. శుద్ధిచేయని మురుగు నీటిలో చాలా కలుషిత పదార్థాలుంటాయి. దీనికారణంగా నీటిలో అమోనియా లెవల్‌ పెరిగిపోతోంది. ఇక కలుషితాల కారణంగా నీటిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది.

Read More : Nara Lokesh: విద్యార్థులను అణచివేయాలని చూస్తే.. ఎంతటి నియంతైనా నేలకొరగడం ఖాయం

వాన లేదా పెనుగాలుల వల్ల నీటివనరుల్లోని నీరు బాగా కదిలినప్పుడు ఫాస్ఫేట్, ఇతర కలుషితాలు విడుదలవుతాయి. అప్పుడు నురగ ఏర్పడుతుంది. ఢిల్లీలో యుమునా నదిలో ఇదే జరుగుతోంది. ఏ ప్రాణీ బతకలేనంత తక్కువ స్థాయికి నీటిలోని ఆక్సిజన్ చేరుకొంటోంది. దీంతో అమోనియా స్థాయి పెరిగిపోతోంది. యమున… జమున… పేరు ఏదైనా అది భారతీయులకు పవిత్రమైనది. యమునలో స్నానమాచరిస్తే  మృత్యుదోషం హరించుకుపోతుందని ఒక నమ్మకం. కానీ ఢిల్లీలో ఉన్న యమునా నదిలో స్నానమాచరిస్తే చాలా రోగాలు ఖాయమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇక ఢిల్లీలో 22 కిలోమీటర్ల మేర ప్రవహించే యమునా నది ఢిల్లీ వాసుల మల మూత్రాలతో పరిశ్రమల కాలుష్యంతో నిండి ఉందని ఇప్పటికే అనేక నివేదికలు తేల్చాయి.

Read More : Yadadri : విమాన గోపురానికి మంత్రి మల్లారెడ్డి విరాళాల సేకరణ, 11 కిలోల బంగారం

ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఢిల్లీలో ప్రవేశించే యమునా నది ప్రవాహాన్ని వజీరాబాద్‌ బ్యారేజీ వద్ద ఆపేసి నీటిని నిల్వ చేస్తారు. అక్కడి నుంచి యమున చుక్క నీరు కూడా రాదు. అంటే ఢిల్లీలో ప్రవహించే యమున అంతా ఢిల్లీ వాసుల మురుగు నీరే. అందులోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఛాత్‌ పూజల విషయంలోనూ అదే జరుగుతోంది. యమున విషకాసారం కావడం వల్ల చుట్టుపక్కల పల్లెల్లోని భూగర్భ జలాలు విషతుల్యమై కీళ్ల నొప్పులు, వాతం, ఇతర చర్మ సమస్యలు కలిగిస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది మహిళలు యమునపై భక్తితో ఈ మురికి కూపంలోనే మునకలు వేస్తున్నారు.