Skirts for Boys: స్కూల్‌కి స్కర్ట్స్ వేసుకొచ్చిన అబ్బాయిలు.. ఎందుకంటే?

మెక్సికో నగరంలో ఓ స్కూల్ విద్యార్థులు అమ్మాయిలు ధరించే స్కర్ట్స్ తో తరగతి గదికి హాజరయ్యారు. కావాలంటే అమ్మాయిలు అబ్బాయిలు ధరించే ట్రౌజర్స్ ధరించవచ్చని.. స్కూల్స్ లో అబ్బాయిలు..

Skirts for Boys: స్కూల్‌కి స్కర్ట్స్ వేసుకొచ్చిన అబ్బాయిలు.. ఎందుకంటే?

Skirts For Boys

Skirts for Boys: మెక్సికో నగరంలో ఓ స్కూల్ విద్యార్థులు అమ్మాయిలు ధరించే స్కర్ట్స్ తో తరగతి గదికి హాజరయ్యారు. కావాలంటే అమ్మాయిలు అబ్బాయిలు ధరించే ట్రౌజర్స్ ధరించవచ్చని.. స్కూల్స్ లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్యన ఈ వస్త్ర విభేదాలు ఉండకూడదని ఇక్కడి విద్యార్థులు నిర్మొహమాటం చెప్తున్నారు. అయితే.. అసలు ఎందుకిలా ధరిస్తున్నారు అంటే కాస్త వెనక్కి వెళ్ళాలి.

Yapral Ganja : అబ్బా..ఏం తెలివి…ఇంట్లోనే పూల కుండీల్లో గంజాయి సాగు

గత ఏడాది ఓ విద్యార్థి ఇంట్లో ఇబ్బందుల కారణంగా అమ్మాయి ధరించే స్కర్ట్ వేసుకొని స్కూల్ కి వెళ్ళాడు. అంతే యాజమాన్యం ఆ విద్యార్థిపై సీరియస్ అయి తరగతి నుండి బయటకి పంపేసింది. అప్పటి నుండి మెక్సికో నగరంలో ఇది మెల్లగా అన్ని పాఠశాలలకు పాకి ఒక ఉద్యమంలా తయారైంది. గత ఏడాది స్కూల్ నుండి పంపేసిన విద్యార్థికి అండగా ఒక్కో పాఠశాల విద్యార్థులు ఒక్కో రోజు ఇలా స్కర్ట్స్ ధరించి మద్దతు తెలుపుతున్నారు.

Yamuna River : మంచు కాదు..పాలపొంగులు కావు..మరేంటి ?

ఈ విద్యార్థుల స్కర్ట్స్ ఉద్యమానికి మెక్సికో నగర మేయర్ కూడా మద్దతు తెలపడం.. విద్యార్థుల పేరెంట్స్ కూడా ఇది ఒక వివక్షగా చూడడంతో ఇది కాస్త రోజు రోజుకీ ఓ భారీ ఉద్యమంగా మారింది. స్కర్ట్స్ ధరించే విద్యార్థులు కావాలంటే విద్యార్థినులు తాము ధరించే ట్రౌజర్స్ ధరించి స్కూల్స్ కి రావచ్చని.. కేవలం డ్రెస్ ఆధారంగా వివక్ష చూపడం మంచిది కాదని.. ఇది పూర్తిగా ప్రజలలోకి వెళ్లెవరకూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు.