MLC AnanthaBabu Police Custody : పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ అనంత బాబు

సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు.(MLC AnanthaBabu Police Custody)

MLC AnanthaBabu Police Custody : రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబును కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు. అనంత బాబును రిమాండ్ కు కూడా తరలించే అవకాశం ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి ఎమ్మెల్సీ అనంత బాబుపై సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు, దళిత సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకు ఎమ్మెల్సీ అనంత బాబును అదుపులోకి తీసుకోకపోవడంపై రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. పోలీసులపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి.

MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారా ?

ఈ క్రమంలో పోలీసులు స్పందించారు. అనంత బాబు తమ అదుపులోనే ఉన్నట్లు పోలీసుల చెబుతున్నారు. నిన్న ఉదయం అనంతబాబును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్రమణ్యం హత్యకు సంబంధించి అనంత బాబును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు.(MLC AnanthaBabu Police Custody)

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అనంత బాబే తన డ్రైవర్ ను హత్య చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కేసు రిజిస్టర్ అయి 72 గంటలు కావస్తున్నా ఎమ్మెల్సీ అనంత బాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు.

MLC Ananthababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు‌పై హత్య కేసు నమోదు

ఇదే సమయంలో లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎమ్మెల్సీ కలిశారని… హత్య కేసు నుంచి రక్షించాలని వారిని కోరారని తెలిపారు. మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని హోంమంత్రి వనిత ఇంత వరకు పరామర్శించలేదని లోకేశ్ దుయ్యబట్టారు.

ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

పోలీసుల విచారణలో అనంతబాబు కీలక విషయాలను వెల్లడించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకోవడంతోనే తానే హత్య చేసినట్లు అనంతబాబు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను హత్య చేయాలని భావించలేదని.. బెదిరించి వదిలేద్దామనుకున్నట్లు అనంతబాబు పోలీసులతో చెప్పారట. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.(MLC AnanthaBabu Police Custody)

హత్యకు గురైన సుబ్రహ్మణ్యం.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేసి కొద్ది నెలల క్రితం మానేశాడు. గురువారం రాత్రి సుబ్రహ్మణ్యం తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రమాదంలో సుబ్రమణ్యం చనిపోయాడని సోదరుడికి స్వయంగా ఎమ్మెల్సీ ఫోన్ చేసి చెప్పారు. కొద్దిసేపటికి సుబ్రహ్మణ్యం డెడ్‌బాడీని కారులో ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. సుబ్రమణ్యంను విగతజీవిగా చూసి కుటుంబసభ్యులు షాక్ తిన్నారు.

సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై ఓ రోజంతా పెద్ద హైడ్రామా నడిచింది. ముందు పోస్ట్‌మార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తర్వాత పోలీసులు వారిని ఒప్పించడంతో పోస్టుమార్టం నిర్వహించి రిపోర్ట్ అందజేశారు. అందులో సుబ్రహ్మణ్యంది హత్యగా తేలగా.. అతడిని కొట్టడంతోనే చనిపోయినట్లు ఫోరెన్సిక్ నిపుణులు నివేదికలో ప్రస్తావించారు. దాడి చేయడంతో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీపై కేసు నమోదైంది.

 

ట్రెండింగ్ వార్తలు