MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారా ?

మరోవైపు ఈ ఘటన జరిగిన రోజు ఎమ్మెల్సీతో పాటు ఎవరెవరు ఉన్నారో వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి దగ్గర్నుంచి సుబ్రమణ్యాన్ని తీసుకెళ్లడం, ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లడం తిరిగి ఇంటికి తీసుకురావడం వరకు సీన్ రీకన్స్‌ట్రక్షన్ చేయనున్నారు.

MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారా ?

Mlc Anantababu

MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రమణ్యం మృతికి సంబంధించిన దర్యాప్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు గంటలుగా ఎస్పీ కార్యాలయంలో ఆడిషనల్ ఎస్పీ, కాకినాడ డీఎస్పీ, దిశ డీఎస్పీ, ఎస్ బీ డీఎస్పీ లతో ఎస్పీ రవీందర్ నాధ్ బాబు సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌పై సిందగ్ధత కంటిన్యూ అవుతోంది. అనంతబాబును అరెస్ట్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అనంతబాబుతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంత వరకూ పోలీసులు అధికారం ఏదీ ప్రకటించలేదు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడితో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసినట్టు తెలుస్తోంది..

ఇక అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రమణ్యం మృతి కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. ప్రిలిమినరీ నివేదికను కాకినాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోలీసులకు అందించారు. సుబ్రమణ్యానిది హత్యేనని వైద్యులు తేల్చినట్టు సమాచారం. సుబ్రమణ్యం తల మీద ఎడమ వైపు గాయం ఉంది. ఎడమ భుజంపై గాయం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పై పెదవి మీద, ఎడమ కాలు బొటన వేలుపై గాయాలున్నాయన్నారు.

MLC Ananthababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు‌పై హత్య కేసు నమోదు

కుడి కాలు చీలమండ దగ్గర గాయాలున్నట్లు తేల్చారు. ఈ నివేదిక ఆధారంగా పోలీసులు విచారణను కొనసాగించనున్నారు. సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు ఎమ్మెల్సీ అనంతబాబు చెబుతుండగా.. హత్యేనని కుటుంబసభ్యులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్ట్‌లో అదే తేలిందని సుబ్రమణ్యం కుటుంబసభ్యులు అంటున్నారు.