ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు

డీజీ ర్యాంకు ఉన్న ముగ్గురు అధికారుల లిస్టును సోమవారం ఉదయం 11 గంటలలోగా పంపాలని చెప్పింది.

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు

DGP Rajendranath Reddy,

ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఈ ఆదేశాలు ఈ క్షణం నుంచే వర్తిస్తాయని పేర్కొంది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని ఆదేశించింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలంటూ సూచనలు చేసింది.

డీజీ ర్యాంకు ఉన్న ముగ్గురు అధికారుల లిస్టును సోమవారం ఉదయం 11 గంటలలోగా పంపాలని చెప్పింది. రాజేంద్రనాథ్ రెడ్డిపై విపక్షాలు చేసిన ఫిర్యాదుల మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల విషయంలో వైఫల్యాలు ఉన్నప్పటికీ, నేతలపై దాడులు జరుగుతున్నప్పటికీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పట్టించుకోవటం లేదని విపక్షాలు ఆరోపించాయి. ఇటీవలే.. డీజీపీని బదిలీ చేయాలంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేశారు.

అంతకుముందు కూడా రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆయనను విధుల నుంచి తప్పించాలని తాము ఈసీకి ఫిర్యాదు చేసినట్లు రెండు వారాల క్రితం టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారు.

ఏపీ సర్కారుపై అమిత్ షా నిరాధార ఆరోపణలు చేశారు.. నిజాలు ఇవే: సజ్జల రామకృష్ణారెడ్డి