Eluru Fores Chemical Factory Closed
Eluru Fores Chemical Factory Fire : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం వద్ద ఉన్న ఫోరస్ ఫ్యాక్టరీలో (Fores Chemical Factory)ప్రమాదం జరిగి ఆరుగురు కార్మికులు చనిపోయిన విషయం తెలిసిదే. ఈ ప్రమాదం తరువాత ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫోరస్ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటించారు.
Also read : Eluru district : ఏలూరు జిల్లాలో విషాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు మృతి
ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారని..మృతుల్లో నలుగురు బీహార్ వాసులు కాగా ఇద్దరు స్థానికులు ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయని వెల్లడించారు.వీరిలో ఏడుగురు బీహార్ వాసులు కాగా ఐదుగురు స్థానికులు ఉన్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుంచి రూ.25 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం తరపునుంచి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించిందని వెల్లడించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.2 లక్షలు పరిహారం చెల్లిస్తామని..గాయపడినవారికి చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చులు యాజమాన్యం భరిస్తుందని కలెక్టర్ వెల్లడించారు.
Also read : Eluru district: అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్ర్భాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 25లక్షలు పరిహారం..
ప్రమాదం జరిగిన తరువాత ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. గురువారం (ఏప్రిల్ 14,2022)ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, నూజీవీడు ఎమ్మెల్యే వెంకట అప్పారావు తదితరులు సందర్శించారు.కాగా ఈ ప్రమాదంపై సీఎస్ సమీర్ శర్మ కలెక్టర్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రమాదం ఘటన ఎందుకు జరిగింది? ఎలా జరిగిందో దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
ఫోరస్ ఫ్యాక్టరీలో ప్రమాదానికి గల కారణాలను అధికారు బృందం దర్యాప్తు చేస్తుందన్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నంత కాలం కంపెనీ వేతనం చెల్లించనుందని కలెక్టర్ తెలిపారు. కంపెనీలోని రియాక్టర్ లో హై ప్రెషర్ వల్లే ప్రమాదం జరిగిందని తేలిందని కలెక్టర్ వివరించారు. ఈ ప్రమాదంపై విచారణ చేస్తున్నామన్నారు.
Also read : Pm Modi: ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో విష వాయువు లీకైంది. ఈ ఘటన 2020 మే 7వ తేదీన చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఫ్యాక్టరీల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సరైన చర్యలు తీసుకోని కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకొంటున్నాయని అక్కిరెడ్డిగూడెం వాసులు ఆందోళన చేస్తున్నారు.