Eluru district : ఏలూరు జిల్లాలో విషాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు మృతి

ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు కార్మికులు మృతి చెందగా, మరో 13 మంది కార్మికులకు గాయాలయ్యాయి...

Eluru district : ఏలూరు జిల్లాలో విషాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు మృతి

Chemical Factory

Eluru district : ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు కార్మికులు మృతి చెందగా, మరో 13 మంది కార్మికులకు గాయాలయ్యాయి. జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డి గూడెం వద్ద పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో యూనిట్ 4లో బుధవారం రాత్రి రియాక్టర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 50 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఒక్కసారిగా రియాక్టర్ పేలి మంటలు చెలరేగడంతో ఐదుగురు కార్మికులు మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు. మరో కార్మికుడు తీవ్రగాయాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు వదిలాడు.

Bhoiguda Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదానికి కారణం కనిపెట్టిన అధికారులు

ఈ ప్రమాదంలో 13 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిపమాదం ఘటనలో రెండు ఫోర్లు పూర్తిగా కాలిపోయాయి. మృతుల్లో నలుగురు బీహార్ కు చెందినవారిగా గుర్తించారు.

Fire Broke Out : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో అగ్నిప్రమాదం

10టీవీతో విజయవాడ ఆస్పత్రి సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో 12మందిని చికిత్స నిమిత్తం చేర్చారని తెలిపారు. వీరందరికి అత్యవసర చికిత్స అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి విషమంగా ఉందని, 70శాతంకు పైగా గాయాలయ్యాయని, బాధితులకు అత్యవసర చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు.