Vangaveeti Radha : నా పై కుట్ర జరిగింది…త్వరలో బయటపడుతుంది…వంగవీటి రాధా సంచలన ఆరోపణలు
నన్ను చంపటానికి రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ(రాధ) సంచలన ఆరోపణలు చేశారు.

Vamshi Nani Radha
Vangaveeti Radha : నన్ను చంపటానికి రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ(రాధ) సంచలన ఆరోపణలు చేశారు. తననుఏదో చేద్దామనుకునిరెక్కీ నిర్వహించారు… నేను భయపడను అని ఆయన అన్నారు. తన తండ్రి రంగా ఆశయసాధనే లక్ష్యంగా తాను పని చేస్తానని పదవులపై తనకు ఆశ లేదని ఆయన చెప్పారు.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ సభలో ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,జి ల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికతో కలిసి పాల్గోన్నారు.
విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం రాధా మాట్లాడుతూ ….తనను పొట్టన పెట్టుకోవాలి అనుకునే వారికి నేను భయపడను,ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు. తనను లేకుండా చెయ్యాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని కోరారు. మంత్రి కొడాలినాని మాట్లాడుతూ వంగవీటి రాధా నాకు తమ్ముడు. నేను వైసిపిలో ఉన్నాను, రాధ టిడిపిలో ఉన్నాడు అనుకుంటా? అని ఆశ్చర్యంగా అన్నారు.
Also Read : Dehradun : తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని సోదరిని హత్య చేసిన సోదరులు
ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టీడీపీ నాయకులు చెప్పినా, పదవులను ఆశించకుండా ఆయన ఆ పార్టీలో చేరారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాగి కలిపితేనే బంగారం కూడా కావలసిన ఆకృతిలో వస్తుందని…. బంగారం లాంటి రాధా, తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీపడితే పరిస్థితి మరోలా ఉండేదని మంత్రి అన్నారు. కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధా నడుస్తున్నాడని కొడాలినాని అన్నారు.