ఇప్పటికే 2 వజ్రాలు లభ్యం.. ఇప్పుడు 3 వజ్రాలు దొరికాయి.. ఎగిరి గంతులు..

Jonnagiri: ఒక వజ్రాన్ని జొన్నగిరి వ్యాపారి కొనుగోలు చేశారు. 5 లక్షల రూపాయలతో పాటు 5 తులాల బంగారం ఇచ్చి దాన్ని

కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరుకుతున్నాయి. ఆదివారం రెండు వజ్రాలు లభ్యం కాగా, సోమవారం మూడు వజ్రాలు దొరికాయి. తుగ్గలి మండలంలో జొన్నగిరి, దేశాయ్ తాండలలో ముగ్గురికి మూడు వజ్రాలు దొరికాయి. వ్యవసాయ కూలీ పనులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులకు మూడు వజ్రాలు లభ్యం కావడంతో ఎగిరి గంతులేశారు.

ఒక వజ్రాన్ని జొన్నగిరి వ్యాపారి కొనుగోలు చేశారు. 5 లక్షల రూపాయలతో పాటు 5 తులాల బంగారం ఇచ్చి దాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లారు. మరో రెండు వజ్రాల కొనుగోలు చేయడానికి వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం కూడా రెండు వజ్రాలు లభ్యం కావడంతో ఒక వజ్రాన్ని 7 లక్షల రూపాయలకు మద్దికెర మండలం పెరవలికి చెందిన వ్యాపారి కొనుగోలు చేశారు.

అలాగే, మరో వజ్రాన్ని అతి తక్కువ ధరకు తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసి పట్టుకెళ్లారు. పది రోజులలో 12కు పైనే వజ్రాలు లభ్యం అయినట్లు తెలుస్తోంది. తుగ్గలి, మద్దికెర మండలంలోని పలు ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి.

ఐదుగురు వ్యాపారులు సిండికేట్ అయి అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నరాని ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగంగానే వజ్రాల కొనుగోలు చేస్తున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

ట్రెండింగ్ వార్తలు