Anantapur : దారుణం.. కన్నకూతురిపై లైంగిక దాడి.. గర్భం దాల్చిన బాలిక
రక్షణగా ఉండాల్సిన తండ్రి కన్నకూతురి పాలిట కలనాగులా మారాడు. అభంశుభం తెలియాలని 15ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
- kunduru Vinod
- Published On : November 25, 2021 / 09:35 AM IST
Anantapur (3)
Anantapur : రక్షణగా ఉండాల్సిన తండ్రి కన్నకూతురి పాలిట కాలనాగులా మారాడు. అభంశుభం తెలియాలని 15ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుంతకల్లు డిఎస్పీ యు. నరసింగప్ప తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్లులో (Guntakal) భాగ్యనగర్‌కు చెందిన పెయింటర్‌కు భార్య ఇద్దరు కుమార్తెలు.. మద్యానికి బానిసైన ఆ వ్యక్తి పదిహేనేళ్ల కూతురిపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం రావడంతో అతడిని మందలించగా ఆమెపై దాడి చేశాడు.
చదవండి : Anantapuram : అనంత జిల్లాలో తప్పిన పెను ప్రమాదం-30 మంది మహిళలు సురక్షితం
కూతురు శరీరంలో మార్పులు గుర్తించిన తల్లి అనుమానంతో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గర్భవతని తేల్చారు. అబార్షన్ చెయ్యాలని వైద్యులను కోరింది బాలికతల్లి.. అయితే అబార్షన్ చేసేందుకు వైద్యులు నిరాకరించారు.. పోలీసులకు సమాచారం ఇస్తామని చెప్పడంతో భయపడిన మహిళ కూతురిని తీసుకోని ఇంటికి వెళ్ళింది.
చదవండి : Anantapur Jntu : అనంతపురం జెఎన్ టియులో బీటెక్ అడ్మీషన్స్
బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి (Kurnool Govt hospital) తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు.. అక్కడా గర్భవతని తేలింది. బాలిక వయసు చాలా తక్కువ కనిపించడం.. పెళ్ళికాలేదని తల్లి చెప్పడంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తల్లీకూతుళ్లను విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి (anantapur govt hospital) తరలిస్తామని ఎస్‌ఐ సురేష్‌బాబు చెప్పారు.
