YSR Congress Party: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజక వర్గాల్లో టీడీపీ, బీజేపీ నుంచి వైసీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు జగన్.
ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పద్మజ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. కోడుమూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోడుమూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి కూడా వైసీపీ గూటికి చేరుకున్నారు.
బీజేపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్. వీరి చేరికలతో స్థానికంగా వైసీపీ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అన్నారు.
Also Read: నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది.. మాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కడియం శ్రీహరి