నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది.. మాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కడియం శ్రీహరి

మతం మారినంత మాత్రాన కులం మారదని చెప్పిందని తెలిపారు. తండ్రి కులమే పిల్లలకు వస్తుందని చెప్పారు.

నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది.. మాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కడియం శ్రీహరి

బీజేపీ నేతలు రాజ్యాంగం మీద అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పడానికి ఏమీలేకపోవడంతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. తన కూతురు కావ్య ఇక్కడే పుట్టిందని తెలిపారు.

కడియం ఫౌండేషన్‌లో ఇక్కడే అనేక సేవా కార్యక్రమాలు చేసిందని చెప్పారు. 2017లో ఐదుగురు జడ్జిల ధర్మసానం ఓ తీర్పు ఇచ్చిందని, మతం మారినంత మాత్రాన కులం మారదని చెప్పిందని తెలిపారు. తండ్రి కులమే పిల్లలకు వస్తుందని చెప్పారు. ప్రజలను తప్పుదోవపట్టించేలా కొందరు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

తన 30 ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. ఆరూరి రమేశ్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయనను తాను వెన్నుపోటు పొడవలేదని చెప్పారు. 2014, 2018 లో ఆయన గెలుపుకోసం ప్రచారం చేశానని తెలిపారు. ఆరూరి రమేశ్ భూకబ్జాల కారణంగా ఓడిపోయారని చెప్పారు.

ఆరూరి రమేశ్ తనను వెన్నుపోటు పొడిచారని అన్నారు. అలాగే, మందకృష్ణ మాదిగ తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీకి ముస్లింలు, క్రిస్టియన్స్, దళితులు అంటే గిట్టదని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వరంగల్లో గెలిచేది కాంగ్రెస్ అభ్యర్థి కావ్యనే అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో వరంగల్‌ను అభివృద్ధి చేస్తానని అన్నారు.

Also Read: మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల