Tollywood Celebrities
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్‌పై టాలీవుడ్ అమితాసక్తిగా చూపుతోంది. కొంతమంది నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు ఆంధ్ర ప్రదేశ్ బయలు దేరి వెళ్లారు. కూటమి గెలిస్తే సంబరాలు చేసుకోవాలని కొంతమంది సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
ఎవరెవరు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు? ఇంకా ఎవరెవరు వెళ్తున్నారు? అన్న విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు సినీ ప్రముఖులు. కూటమి వస్తే గ్రాండ్ గా పార్టీ చేసుకోవాడానికి అక్కడకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మెగా ఫ్యామిలీ కూడా ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపుపై ఆసక్తిగా ఎదురు చూస్తోంది మెగా ఫ్యామిలీ. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఆరా తీస్తోంది. ఇప్పటికే జనసేనకు మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే.
Also Read: ఎన్నికల కౌంటింగ్ టెన్షన్.. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక కామెంట్స్