ఎన్నికల కౌంటింగ్ టెన్షన్.. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌.. కీలక కామెంట్స్

Chandrababu Naidu: ఏపీలో ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో ముగింపు పడుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఎన్నికల కౌంటింగ్ టెన్షన్.. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌.. కీలక కామెంట్స్

chandrababu naidu

Updated On : June 3, 2024 / 7:40 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలో టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో ముగింపు పడుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నాయుడు అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తప్పలేదని తెలిపారు. ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ కౌంటింగ్‌లో హింసకు పాల్పడాలనుకుంటోందని చెప్పారు. కానీ, కూటమి కౌంటింగ్ ఏజెంట్లు మాత్రం సంయమనం కోల్పోవద్దని అన్నారు. ఏజెంట్లు నిబంధనలకు పట్టుబట్టాలని ఆయన చెప్పారు.

Also Read: ఏపీలో అడుగడుగునా పోలీసులు, కేంద్ర బలగాలు.. కౌంటింగ్‌కు భారీ భద్రత ఏర్పాట్లు