Fire In Rtc Bus At Kakinada East Godavari
fire in RTC bus at Kakinada : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న ఏసీ బస్సు పరిషత్ సెంటర్‌కు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు రేగాయి. అయితే మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను కిందకు దించివేశాడు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు.
డ్రైవర్ మంటలను గమనించకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు రేగినట్లు అనుమానిస్తున్నారు. బస్సులో మంటలు రేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.