AP Rain Alert : ఏపీలో ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు.. బీ అలర్ట్..!

AP Rain Alert : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఎండతీవ్రత పెరిగిపోతోంది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

Forecast Thundershowers In Several Districts In State, Alerts Ap Meteorological Department

AP Rain Alert : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఎండతీవ్రత పెరిగిపోతోంది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. విజయవాడలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లిలో అత్యల్పంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కానీ, రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. ఏపీలో ప్రధానంగా తూర్పు గోదావరి, కాకినాడ, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి, వై. రామవరం, అడ్డతీగల, దేవీపట్నం రంపచోడవరం, గంగవరం ప్రాంతాల్లో పిడుగుల పడతాయని హెచ్చరించింది. తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం, కోరుకొండ, కాకినాడ జిల్లాలో జగ్గంపేట, ఏలేశ్వరంలో పిడుగులు పడొచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి, రామాపురం, రాయచోటి, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె మండలాలు పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Forecast Thundershowers In Several Districts In State, Alerts Ap Meteorological Department

ఆయా జిల్లాలోని పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు ఎత్తైనా చెట్ల కింద ఉండరాదని సూచించింది. అంతేకాదు.. బహిరంగ ప్రదేశాల్లోనూ బయట ఉండరాదని జిల్లా ప్రాంత వాసులకు వాతావరణ శాఖ సూచనలు చేసింది. పిడుగులు పడే సమయంలో జిల్లాల వాసులు సురక్షిత భవనాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Read Also : AP Rains : అల్పపీడన ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు