AP Rains : అల్పపీడన ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారి, సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు.

AP Rains : అల్పపీడన ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు

Ap Rains

Updated On : March 20, 2022 / 1:43 PM IST

AP Rains :  బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారి, సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు.

ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22వతేదీన బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణ దిశ గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

రాగల 3 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Aslo Read : Telangana: తెలంగాణలో ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
ఆది, సోమవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉండి…ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. ఇక, రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉండి…ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.