Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టెండర్లు లేకుండా ఇరిగేషన్ పనులు ప్రారంభించారన్న నేపథ్యంలో పొదలకూరు మండలం సంగెం, సూరాయపాళెం కనుపూరు కాలువ పరిశీలనకు గోవర్ధన్ రెడ్డి బయలుదేరారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. తమకు సహకరించాలని వెంకటాచలం, వేదాయపాలెం పోలీసులు కోరారు.
Also Read : అందుకే, ఆయన అలా అన్నారు- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత రియాక్షన్..
అయితే, ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి నివాసంకు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వైసీపీ ప్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించివేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఉద్రిక్తత పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో భారీగా పోలీసులను మోహరించారు.