Kodali Nani
చాలా కాలం తర్వాత గుడివాడలో కనపడ్డారు మాజీమంత్రి కొడాలి నాని. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకు హాజరయ్యారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నాని హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అయితే, కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. దీంతో ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకు ఆయన వచ్చారు. ఈ కేసులో బెయిల్ పై ఇప్పటికే 16 మంది అనుచరులు రిలీజ్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత గుడివాడలో కొడాలి నాని బహిరంగంగా కనపడడం ఇదే తొలిసారి.
Also Read: ఇలాగైతేనే అభివృద్ధి జరుగుతుంది: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మరోవైపు, కొడాలి నాని అరెస్ట్ తప్పదంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆయన గుండె సంబంధింత సమస్యలతో ముంబైలోని అసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ వచ్చేశారు. అప్పటి నుంచి కొడాలి నాని అరెస్ట్ తప్పదంటూ ప్రచారం జరిగింది. ఆయన అరెస్ట్‌కు పోలీసులు రంగం చేస్తున్నారంటూ ఎప్పటి నుంచో వదంతులు వస్తున్నాయి.