Chandrababu Naidu: ఇలాగైతేనే అభివృద్ధి జరుగుతుంది: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తాను ఉన్నంత వరకు నేరస్థులకు ఏపీలో చోటు లేదని హెచ్చరించారు.

శాంతి భద్రతలు ఉన్నచోటే అభివృద్ధి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు.
సాంకేతికతతో పాటు సంఘ విద్రోహ శక్తులపై దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు. తాను ఉన్నంత వరకు నేరస్థులకు ఏపీలో చోటు లేదని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ రౌడీయిజాన్ని, స్మగ్లర్లను కట్టడి చేశామని తెలిపారు.
భారత్‌లో అత్యధిక తలసరి ఆదాయంగల రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని చంద్రబాబు చెప్పారు. ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. మాజీ సీఎం ఎన్ని నాటకాలు ఆడారో అందరూ చూశారని అన్నారు. రౌడీలే రాజకీయాల్లోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాము ఇప్పుడు కూడా టెక్నాలజీతో పాటు సంఘ విద్రోహ శక్తులపై దృష్టి పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. క్వాంటం వ్యాలీ కింద ఏఐకి ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. కృత్రిమ మేధ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి సత్తా చాటాలని చెప్పారు. రాపిడో వ్యవస్థాపకుడు కూడా మన వాడేనని చంద్రబాబు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ర్యాపిడో వ్యవస్థాపకుడు కూడా మన వాడేనని తెలిపారు.