Seediri Appalaraju Remanded: మాజీ మంత్రి సీదిరి అప్పల రాజుకు 14 రోజుల రిమాండ్.. అంపోలు జైలుకు తరలింపు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు(Seediri Appalaraju Remanded)కు పలాస జేఎంఎఫ్‌సీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
- V Santhosh Kumar
- Published on- July 23, 2026 / 07:24 PM IST
Former minister sidiri appalaraju remanded 14 days palasa case
- సీదిరి అప్పలరాజుకు జ్యుడీషియల్ రిమాండ్
- కుమారుడిని రక్షించేందుకు కుట్ర
- అంపోలు జైలుకు తరలించిన పోలీసులు
Seediri Appalaraju Remanded: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తీవ్ర సంచలనం నమోదైంది. పలాస కల్పబుల్ హోమిసైడ్ కేసులో వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస జేఎంఎఫ్‌సీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనను ఏ-3 నిందితుడిగా పోలీసులు చేర్చారు.
Fcra Amendment Bill: స్వచ్ఛంద సంస్థల ఆటలకు చెక్.. FCRA బిల్లులో ఏముంది?
కొడుకుని రక్షించేందుకు కుట్ర ఆరోపణలు:
తన కుమారుడు ఆరవ్ వర్మను కేసు నుంచి రక్షించేందుకు మాజీ మంత్రి కుట్ర పన్నారని పోలీసులు అభియోగం మోపారు. అసలు నిందితుడిని తప్పించి, వేరొక వ్యక్తిని నిందితుడిగా చూపించేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు అప్పల రాజుపై 105 BNS, 61(2), 231, 238, 240, 242, 249, 49 తదితర తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అంపోలు జైలుకు సీదిరి తరలింపు:
పోలీసులు మాజీ మంత్రిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య సీదిరి అప్పలరాజు(Seediri Appalaraju Remanded)ను అంపోలు సబ్‌జైలుకు తరలించారు. ఈ పరిణామంతో శ్రీకాకుళం జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
