B Tech Ravi: ఎన్నికల వేళ ఏపీలో మరో కీలక పరిణామం.. బ్రదర్‌ అనిల్‌తో బీటెక్‌ రవి..

ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే.

B Tech Ravi Meets brother Anil

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల భర్త అనిల్‌ను టీడీపీ నేత బీటెక్‌ రవి కలిశారు. కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి బ్రదర్ అనిల్ కుమార్ ఇండిగో విమానంలో బయలుదేరారు. ఆ సమయంలో కడప విమానాశ్రయంలోనే వీఐపీ లాంజ్‌లో బ్రదర్ అనిల్‌ను బీటెక్ రవి కలిశారు. ఈ సందర్భంగా ఫొటో దిగారు.

బ్రదర్ అనిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… తాను వ్యక్తిగత పనుల మీద వచ్చానని తెలిపారు. వైఎస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు. పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలను షర్మిల చెబుతారని తెలిపారు.

కాగా, వైఎస్సాటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ నుంచి కడప విమానాశ్రయానికి కుటుంబ సమేతంగా బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ అధికారిక నివాసానికి షర్మిల కుటుంబం చేరుకుంటుంది.

జగన్‌కు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు షర్మిల. ఆ తర్వాత డిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. రేపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీలో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.

Supreme Court: సుప్రీంకోర్టులో ‘అమరావతి’ కేసుల విచారణ వాయిదా