Supreme Court: సుప్రీంకోర్టులో ‘అమరావతి’ కేసుల విచారణ వాయిదా

ఈ కేసులో ఇంకా లిఖిత పూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడం పూర్తి కాలేదని చెప్పారు. నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Supreme Court: సుప్రీంకోర్టులో ‘అమరావతి’ కేసుల విచారణ వాయిదా

Supreme Court

Updated On : January 3, 2024 / 2:30 PM IST

సుప్రీంకోర్టులో ‘అమరావతి’ కేసుల విచారణ ఏప్రిల్‌కు వాయిదా పడింది. ఆ నెలలో పూర్తి స్థాయిలో వాదనలు విన్న తరువాతే తాము తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏపీ సర్కారు తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన తీరు సమంజసం కాదని తెలిపారు.

రైతుల తరఫున వాదించిన న్యాయవాది దేవదత్ కామత్ మాట్లాడుతూ.. ఈ కేసులో ఇంకా లిఖిత పూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడం పూర్తి కాలేదని చెప్పారు. నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ రాజధాని అమరావతే అంటూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ఆ తీర్పును ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై వాదనలు జరుగుతున్నాయి. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన వచ్చింది. దీనిపై అమరావతి రైతులతో పాటు విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నాయి.

CM Jagan : ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరికపై కాకినాడ సభలో జగన్ పరోక్ష వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?