CM Jagan : ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరికపై కాకినాడ సభలో జగన్ పరోక్ష వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

కాకినాడ సభలో జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ప్రస్తావించారు.

CM Jagan : ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరికపై కాకినాడ సభలో జగన్ పరోక్ష వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

AP CM Jagan

Updated On : January 3, 2024 / 2:01 PM IST

YS Sharmila : ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న షర్మిల.. రేపు రాహుల్, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. షర్మిలతోపాటు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఈ దఫా ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ లను పక్కన పెడుతున్న విషయం తెలిసిందే. వారిలో కొందరు షర్మిల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది. ఈ క్రమంలో కాకినాడ సభలో సీఎం జగన్ తన సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Also Read : CM Jagan : కేంద్రానికి పవన్ రాసిన లేఖపై స్పందించిన సీఎం జగన్ .. కాకినాడ సభలో స్ట్రాంగ్ కౌంటర్

కాకినాడ సభలో జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు జరగుతాయని సీఎం జగన్ అన్నారు. అంతేకాదు.. కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు.. కుటుంబాలను చీల్చుతారు.. అబద్దాలు చెబుతారు.. మోసాలు చేస్తారు.. ఇన్నవీ జరుగుతాయి. మీరంతా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు జగన్ సూచించారు. జగన్ తన ప్రసంగంలో కుటుంబాలను చీల్చుతారంటూ వ్యాఖ్యానించడాన్నిబట్టిచేస్తే .. షర్మిల కాంగ్రెస్ లో చేరికను జగన్ పరోక్షంగా విమర్శించినట్లు రాకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Also Read : CM Jagan : రేపు హైదరాబాద్ కు సీఎం జగన్.. ఎందుకంటే?

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే.. వైసీపీ పార్టీకే నష్టం జరుగుతుందని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇదే విషయాన్ని కాకినాడ సభలో జగన్ పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇవాళ మధ్యాహ్నం వైఎస్ షర్మిల తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు అట్లూరి ప్రియాలతో కలిసి షర్మిల జగన్ వద్దకు వెళ్తారని తెలుస్తుంది. వారి వివాహ శుభలేఖను జగన్ కు షర్మిల అందజేయనున్నారు. ఆ తరువాత షర్మిల ఢిల్లీ వెళ్తారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏ పదవి అప్పగిస్తుంది.. ఏపీలో షర్మిల ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది అనే అంశం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.