Nellore Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
నెల్లూరు జిల్లా గూడురు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో రెండు లారీలు కారును ఢీకొనడంతో నలుగురు చనిపోయారు.

Nellore Accident
Road Accident in Nellore: నెల్లూరు జిల్లా గూడురు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో రెండు లారీలు కారును ఢీకొనడంతో నలుగురు చనిపోయారు. ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన కారు లారీని ఢీకొట్టింది. వెంటనే వెనుక వస్తున్న మరో లారీ కారును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. తిరుమలలో దైవదర్శనం చేసుకుని రాజమండ్రికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ మరొకరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతిలుగా పోలీసులు గుర్తించారు. లిఖిత అనే యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.