గోదావరిలో స్నానానికి వెళ్లిన నలుగురు విద్యార్ధులు గల్లంతు

four students drown in godavari river in siddantham : పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం లో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని కేధార్ ఘాట్ శివారు లంక పాయలో స్నానానికి దిగిన నలుగురు విద్యార్ధులు నదిలో గల్లంతయ్యారు. తణుకు శశి కళాశాలలో ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు…. ఆదివారం సెలవు కావడంతో సిధ్దాంతం వద్ద కేదార్ ఘాట్ లో స్నాననికి వచ్చారు.
స్నానానికి నీటిలో దిగగా నలుగురు విద్యార్దులు నీటిలో కొట్టుకు పోయారు వీరిలో బచ్చల కల్యాణ్ 17 సo.లు (పాలింగి గ్రామం) , పట్నాల మణికంఠ17 సo.లు (ఉండ్రరాజవరం గ్రామం) నీటిలో మునిగి మృతి చెందారు. మరో ఇద్దరి సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది. లభ్యమైన మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.