Yarlagadda Venkat Rao : గుడివాడలో నందమూరి హరికృష్ణను ఓడించింది కొడాలి నానీనే- యార్లగడ్డ వెంకట్రావు

రాజకీయ అవసరాల కోసం జూనియర్ ఎన్టీఆర్, వంగవీటి పేరు వాడుకోవడం తప్ప నిజంగా వారితో ఎప్పుడూ ఎలాంటి సత్సంబంధాలు వంశీ-కొడాలికి లేవు. Yarlagadda Venkat Rao - Kodali Nani

Yarlagadda Venkat Rao - Kodali Nani (Photo - Google)

Yarlagadda Venkat Rao – Kodali Nani : గన్నవరం టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.. అప్పుడే ప్రత్యర్థులపై ఫోకస్ పెట్టారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. ఆ ఇద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడలో నందమూరి హరికృష్ణకు డిపాజిట్ కూడా రాకుండా ఓడించింది కొడాలి నానీ నే అని యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. గన్నవరంలో నారా లోకేశ్ యువగళం బహిరంగ సభలో యార్లగడ్డ వెంకట్రావు పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.

”నియోజకవర్గం ఆవిర్భావo నుంచి కూడా గన్నవరం కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం ఉన్న ప్రాంతం. ఎందరో మహానుభావులు గెలిచిన ఈ ప్రాంతానికి వంశీ లాంటి నీచుడు ఎమ్మెల్యేగా వస్తాడని ఎవరూ ఊహించలేదు. గన్నవరం ప్రజలు నాకైనా వంశీకైనా డొక్క చించి డోలు కట్టేది ఓటు ద్వారానే. నోరు పారేసుకుంటున్న వంశీ, ఖమ్మంలో ఒకాయన 50లక్షల క్యాష్ రివార్డు ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 10 కోట్లు లాంటి రివార్డు ఎవరైనా ప్రకటిస్తే ఇక వంశీ పరిస్థితి ఏంటి?

Also Read..Mangalagiri Constituency: లోకేశ్ జోరుకు బ్రేక్‌లు వేసేదెవరు.. ఆర్కేను బాపట్లకు మారుస్తారా?

గుడివాడలో నందమూరి హరికృష్ణకు డిపాజిట్ రాకుండా ఓడించింది కొడాలి నానీనే. హరికృష్ణ ఎన్నికల ఖర్చు డబ్బులు తన పెట్రోల్ బంకులో దాస్తే పోలీసులు తీసుకుపోయారని అబద్ధాలు చెప్పిన దుర్మార్గుడు కొడాలి నాని. రాజకీయ అవసరాల కోసం జూనియర్ ఎన్టీఆర్, వంగవీటి పేరు వాడుకోవడం తప్ప నిజంగా వారితో ఎప్పుడూ ఎలాంటి సత్సంబంధాలు వంశీ-కొడాలికి లేవు. తన ఎన్నికల అఫిడవిట్ లో విద్యార్హతపై ఏ రోజూ కొడాలి నాని నిజం రాయలేదు” అని విరుచుకుపడ్డారు యార్లగడ్డ వెంకట్రావు.

తాను గన్నవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ ఖాతాలో వేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. పసుపు కండువా కప్పి యార్లగడ్డను టీడీపీలోకి ఆహ్వానించారు లోకేశ్. యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలో కీలకనేతగా ఉన్నారు. కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

Also Read..Chirala: ఆమంచి, కరణం గ్రూప్‌వార్‌.. వైసీపీ ట్రబుల్ షూటర్‌ ఎంట్రీతో పరిస్థితులు చక్కబడతాయా?

గత ఎన్నికల్లో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పుడాయన వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనపై గెలిచింది టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ. ఇప్పుడదే వంశీ వైసీపీకి దగ్గర కాగా, యార్లగడ్డ టీడీపీ పక్షాన చేరారు. ఈసారి ఎన్నికల్లోనూ యార్లగడ్డ, వంశీ మధ్య పోరు ఉండే అవకాశాలున్నాయని సమాచారం. చంద్రబాబు ఆదేశిస్తే గన్నవరం లేదా గుడివాడ ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధమే అని యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు.