వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలేలా లేరు.. గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు

పరిస్థితి చూస్తూ ఉంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలేలా లేరు. ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డినని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

ganta srinivasa rao: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీలో చేరుతుండడంపై టీడీపీ సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”వైసీపీ మునిగిపోయే నావ. ఈ విషయం ముందే చెప్పాను. రాజీనామా చేసి మా పార్టీలో చేరుతామంటే స్వాగతిస్తున్నాం. ఇప్పడు చేరుతున్న వారు రాజీనామా చేసి పార్టీ లో చేరుతున్నారు. విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల సమయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. అభివృద్ధి దృష్ట్యా కొందరి చేరికలు పార్టీకి బలం చేకూరుతాయని స్పష్టం చేశాను. పరిస్థితి చూస్తూ ఉంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలేలా లేరు. ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డిన”ని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

కాగా, సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యులు మోవిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీకి రాజీనామా చేశారు. మరికొందరు వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఇమడలేక ఎవరైనా టీడీపీలో చేరాలనుకుంటే పదవులకు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామని చంద్రబాబు తేల్చి చెప్పారు. కొంత మంది నాయకుల విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీ బలోపేతానికి అవసరమైన వారినే చేర్చుకుంటామన్నారు.

Also Read: అందుకే టీడీపీలో చేరుతున్నా.. మోపిదేవి వెంకటరమణ కీలక వ్యాఖ్యలు

ఎవరినిబడితే వారిని పార్టీలోకి తీసుకోవద్దని పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష అధిష్టానానికి సూచించారు. అధికారం కోసం వారిని చేర్చుకుంటే.. అధికారం లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని అవమానించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, అభివృద్ధి కోరుకుని, తమతో కలిసి పనిచేయడానికి వచ్చేవారికి ఆహ్వానం పలుకుతామని కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.

Also Read: అందుకే ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పా.. తాడిపత్రి సీఐ క్లారిటీ

ట్రెండింగ్ వార్తలు