Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర తగ్గింది. వెండి ధరలుసైతం తగ్గాయి. గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది.

Gold Rate
Gold and Silver Rates Today: పండుగలున్నా, వివాహాలు, శుభకార్యాలు ఇలా ఎలాంటి సందర్భమైన మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. గత కొద్దిరోజులుగా పెళ్లిళ్ల సందడి కొనసాగడంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. కొద్దిరోజుల్లో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. వరుసగా పండుగలు రానున్న నేపథ్యంలో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, బంగారం ధరలు ప్రతీరోజూ తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. తాజాగా గురువారం గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి. 10గ్రాముల బంగారంపై రూ. 340 నుంచి రూ. 400 వరకు తగ్గుదల చోటుచేసుకోగా, కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది.

Gold
తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం నమోదైన ధరలతో పోల్చుకుంటే గురువారం 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 340 తగ్గగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.380 తగ్గింది. దీంతో ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్టణంలలో గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,500కు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ. 59,450గా నమోదైంది.

Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
– ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 54,650 కాగా 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,600 వద్ద కొనసాగుతోంది. బుధవారంతో పోల్చితే గురువారం 22 క్యారెట్ల బంగారంపై రూ.340, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 390 తగ్గింది.
– బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,450గా నమోదైంది. బుధవారంతో పోల్చితే గురువారం 22 క్యారెట్ల బంగారంపై రూ. 340, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 380 తగ్గింది.
– కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,450గా నమోదైంది. బుధవారంతో పోల్చితే గురువారం 22 క్యారెట్ల బంగారంపై రూ.340, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 380 తగ్గింది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,800 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 59,780 వద్ద కొనసాగుతుంది. బుధవారంతో పోల్చితే గురువారం 22 క్యారెట్ల బంగారంపై రూ. 400 తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 430 తగ్గింది.
– ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 54,500 కాగా 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,450 వద్ద కొనసాగుతోంది. బుధవారంతో పోల్చితే గురువారం 22 క్యారెట్ల బంగారంపై రూ.340, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 380 తగ్గింది.

Gold
వెండి ధరలుసైతం తగ్గాయి. గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ. 73,500కు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77వేలు, ముంబయిలో రూ. 73500, ఢిల్లీలో రూ. 73500, బెంగళూరులో 73వేలు, కోల్ కతాలో 73500, కేరళ రాష్ట్రంలో కిలో వెండి ధర రూ. 77వేలుగా నమోదైంది.