×
Ad

AP Ration Cards: రేషన్ కార్డులు లేని వారికి బిగ్ న్యూస్.. అలాగే కొత్తగా పెళ్లయిన వారికి కూడా..

గతంలో కొత్తగా పెళ్లైన దంపతులు రేషన్‌ కార్డ్ పొందాలంటే ముందుగా మహిళను తల్లిదండ్రుల జాబితా నుంచి తొలగించే వారు.

New Ration Cards: మీకు కొత్త రేషన్ కార్డు కావాలా? దాని కోసం ఏం చేయాలి? ఎక్కడ అప్లయ్ చేసుకోవాలి? ఇలాంటి సందేహాలు, అనుమానాలు చాలామందిలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. రేషన్ కార్డుల కోసం గతంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనేక నిబంధనలు, ప్రక్రియలు ఉండేవి. ఇదంతా పెద్ద తలనొప్పి వ్యవహారంగా ఉండేది. ఇప్పుడా అవసరం లేదు, బాధ లేదు.

ఇకపై ఎవరైనా, ఎప్పుడైనా తమకు కావాల్సిన రేషన్ కార్డును చాలా ఈజీగా పొందొచ్చు. పెద్దగా కష్టపడకుండానే సింపుల్ గానే కొత్త కార్డులు పొందొచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల్లో కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చే దరఖాస్తులను స్వీకరించే బాధ్యతను డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించింది. దీని వల్ల ప్రజలు తమ ఇంటికి సమీపంలోనే ఈ సేవలు పొందగలుగుతారు.

కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సైతం ప్రభుత్వం సులభతరం చేసింది. జనవరి నుంచి జూన్ వరకు అప్లయ్ చేసుకున్న వారికి జులైలో కొత్త కార్డులు ఇస్తారు. జూలై నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరిలో కొత్త కార్డులు అందిస్తారు.

ఇక కొత్తగా పెళ్లైన దంపతులు సైతం రేషన్‌ కార్డు ఈజీగానే పొందొచ్చు. ఇందుకు ఆధార్ కార్డులు, మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే చాలు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మ్యారేజ్‌ స్ప్లిట్ ఆప్షన్‌ ద్వారా కొత్త రేషన్‌ కార్డు పొందొచ్చు.

గతంలో కొత్తగా పెళ్లైన దంపతులు రేషన్‌ కార్డ్ పొందాలంటే ముందుగా మహిళను తల్లిదండ్రుల జాబితా నుంచి తొలగించే వారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు వారికి రేషన్‌ అందేది కాదు. కానీ ఇప్పుడా సమస్య లేదు. భార్య భర్త తమ ఆధార్ కార్డులు, భర్త పాత రేషన్‌ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్తే చాలు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మ్యారేజ్‌ స్ప్లిట్‌ ఆప్షన్ ‘లో వారి వివరాలు నమోదు చేస్తారు. ఒక నెంబర్ కేటాయిస్తారు. దాని ఆధారంగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత వీఆర్వో, తహసీల్దారు పరిశీలనకు పంపుతారు. వారి అనుమతి లభించగానే కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తారు. ఈలోగా వారికి అత్త వారింట్లోనే రేషన్‌ అందజేస్తారు.

ఇక రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు చేర్చడానికి, అడ్రస్ మార్చుకోవడానికి కొత్త నిబంధనలు వచ్చాయి. దీని కోసం పిల్లల ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్స్, తల్లిదండ్రుల రేషన్ కార్డు తప్పనిసరి. ఈ వివరాలను నమోదు చేశాక వీఆర్వో, తహసీల్దారు పరిశీలించి అనుమతిస్తారు. అప్పుడు పిల్లల పేర్లు కార్డులోకి ఎక్కుతాయి.

Also Read: ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు..