AP Govt : ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు..

AP Govt రాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఈనెల 24వ తేదీ నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

AP Govt : ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు..

AP Govt

Updated On : November 21, 2025 / 7:07 AM IST

AP Govt : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆధ్వర్యంలో ప్రజలకు మేలు జరిగేలా వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికల హామీల్లో భాగమైన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుండటంతో పాటు అదనంగా పేద వర్గాల ప్రజలు, రైతులకు మేలు జరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది.

రాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఈనెల 24వ తేదీ నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయంలో పంచసూత్రాలు అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహిస్తారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది సహా 10వేల మందితో సీఎం చంద్రబాబు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై దిశానిర్దేశం చేశారు.

Also Read : Supreme Court : బిల్లుల అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధింపుపై.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

నీటిభద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే పంచసూత్రాల విధానాన్ని చేపట్టామని, వీటిపై రైతులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులు, ఆక్వా, ఉద్యాన, సెరికల్చర్ రైతులకూ అవగాహన కల్పించాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల్లో ఉండే సిబ్బంది ముందుండి దీన్ని చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు.

రైతన్నా.. మీ కోసం కార్యక్రమం ద్వారా.. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. దీని కోసం ఆదునిక పద్దతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికీ వెళ్లి ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించనున్నారు. రైతులు ఏ పంటలు వేశారు..? వారికి ఎలాంటి సాయం అవసరం అనే విషయాన్ని నేరుగా తెలుసుకోని, సాగులో పురుగులు మందుల వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు ఈ కార్యక్రమం ద్వారా వివరించనున్నారు.

తక్కువ వినియోగం వల్ల లాభాలు, సేంద్రీయ విధానం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో ఏ స్థాయిలో డిమాండ్ ఉందనే విషయాలను రైతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్లి వివరించనున్నారు. సమర్థ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వంటి విషయాలను రైతన్నా.. మీకోసం కార్యక్రమం ద్వారా రైతులకు వివరించనున్నారు.