AP Capital Amaravati Representative Image (Image Credit To Original Source)
AP Capital Amaravati: మళ్లీ అదే చర్చ. ఎప్పటిలాగే రచ్చ. జగన్ నోట అమరావతి మాట. ఇటు కూటమి నుంచి రియాక్షన్‌తో మరోసారి నవ్యాంధ్ర రాజధానిపై చర్చ షురూ అయింది. ఓవైపు రాజధానికి చట్టబద్దత కల్పించేందుకు స్టేట్ సర్కార్ ప్రయత్నిస్తున్న క్రమంలో..జగన్ చేసిన వ్యాఖ్యల చుట్టూ వివాదం రాజుకుంది. అమరావతిపై వైసీపీ అధినే జగన్ విషం కక్కారని టీడీపీ ఆరోపిస్తుంటే..రైతుల పక్షాన జగన్ గొంతెత్తారని వైసీపీ సమర్ధించుకుంటుంది. రాజధానిపై మళ్లీ చర్చ ఎందుకు స్టార్ట్ అయినట్లు.? జగన్ అమరావతి ఇష్యూను ఎందుకు గెలికినట్లు.?
ఏపీ రాజధాని. కోటాది మంది ఆంధ్రుల ఆశల నగరం..అమరావతి చుట్టే ఏపీ రాజకీయం. అప్పటి నుంచి అదే చర్చ. ఇప్పటికీ అదే రచ్చ. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్..మరోసారి అమరావతిపై హాట్ డిబేట్‌కు దారితీశాయి. ఏపీ రాజధాని ప్రాంతంగా అమరావతి అనుకూలమైంది కాదన్న జగన్..రాజధానికి మౌలిక సదుపాయాల కొరత ఉందని అన్నారు. లక్షల కోట్ల భారీ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకొచ్చారు.
రాజధాని పేరుతో చంద్రబాబు వేలాది ఎకరాల సేకరణ పేరుతో చేస్తున్నది సరైందని కాదని కూడా జగన్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ మరోసారి రాజధాని అంశాన్ని గెలకడంతో అమరావతి విషయంలో మళ్లీ చర్చ నడుస్తోంది. జగన్ వ్యాఖ్యలు కాస్త పొలిటికల్ డైలాగ్‌వార్‌కు దారితీశాయ్. సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నారాయణ..వైసీపీ అధినేత వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంతో కాక మొదలైంది.
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఆలోచనలు మారుతున్నాయా? లేక మూడు రాజధానుల లైన్‌కే కట్టుబడి ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. ఒక్కోసారి ఒక్కో తీరుగా వైసీపీ నేతలు స్పందిస్తున్న తీరు గందరగోళానికి దారితీస్తోందని మండిపడుతున్నాయి కూటమి పార్టీలు. ఓసారి మూడు రాజధానుల ముచ్చటే లేదంటారు. మరోసారి సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంటారు. అమరావతే రాజధాని కానీ..విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే డెవలప్‌మెంట్‌కు స్కోప్ ఉంటుందని మరో వైసీపీ నేత వాయిస్ వినిపిస్తుంటారు.
ఇంతకు ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటో క్లారిటీ ఇవ్వాలని..జగన్ మాటల్లో కూడా ఈ క్లారిటీ మిస్ అయిందని అంటున్నారు. రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నారా? రాజధాని నిర్మాణంలో తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావిస్తున్నారా? లేక మూడు రాజధానుల నినాదానికే కట్టుబడి ఉన్నారా? ఇదేది స్పష్టత లేదని అంటోంది టీడీపీ. ఓవైపు రాజధాని రైతుల సమస్యలను ప్రస్తావిస్తారు..మరోవైపు లక్షల కోట్ల భారీ ప్రాజెక్ట్ అంటారు. ఇంతకు జగన్ ఉద్దేశమేంటనేది ఎవరికి అంతు చిక్కడం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఏపీకి అంటూ ఓ రాజధాని ఉండాలని ప్రజలు కోరుకుంటుంటే..జగన్ మాత్రం ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూ చర్చకు..రచ్చకు ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు.
ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా..అమరావతి రైతుల కోరిక ప్రకారం రాజధానికి చట్టబద్దత కోసం..గెజిట్ తెచ్చేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి టైమ్‌లో మాజీ సీఎం జగన్ మరోసారి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసేలా..మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ దారుణంగా ఓడిపోయిందని మర్చిపోయారా అంటూ గుర్తు చేస్తున్నారు. విశాఖ ఆర్థిక రాజధాని అంటూ ఉత్తరాంధ్రలో..కనీసం కూటమి అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వలేకపోయిందని విమర్శిస్తున్నారు.
వైసీపీ ఘోర పరాజయానికి రాజధాని అంశం కూడా ప్రధాన కారణమనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి విజయవాడ వరకు వైసీపీ అడ్రస్ లేకుండా పోయిందని..అమరావతిని కాదనుకుని..మూడు రాజధానులు అంటూ కొత్త నివాదం ఎత్తుకోవడమే అందుకు కారణమంటూ వైసీపీపై అటాక్‌కు దిగుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా..ప్రజల అభిప్రాయం..ఆకాంక్షలకు విరుద్దంగా జగన్ మాట్లాడాల్సిన తీరు ఇది కాదంటూ తప్పుబడుతోంది టీడీపీ. రాజధాని విషయంలో వైసీపీనే కన్‌ఫ్యూజన్‌లో ఉందో..లేక ప్రజలనే కన్‌ఫ్యూజన్‌లో పెట్టి..హిడెన్ ఎజెండాతో ముందుకు వెళ్తుందో తెలియదు కానీ..ఈ గందరగోళానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.
Also Read: విపక్ష వైసీపీ టార్గెట్‌గా కూటమి సరికొత్త ఎత్తులు.. సభకు రాకుండా జీతాలు ఎలా అంటూ..?