Gossip Garage : ఆ కేసు అప్పట్లో పెద్ద వివాదమైంది. ఆ నేత వెంటనే పదవిని, పార్టీని వదులుకున్నారు. ఏకంగా పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పారు. చంద్రబాబుతో వైరం లేదన్నారు. పవన్ కల్యాణ్ అంటే గౌరవం అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆయనను కేసులు వీడటం లేదు.
ఏ కేసు భయంతో అయితే ఆయన వైసీపీని వీడారని ప్రచారం జరిగిందో.. ఇప్పుడదే కేసులో సీఐడీ నోటీసులు అందాయి. అంతేకాదు ఓ మహిళా నేత టార్గెట్‌గా ఏసీబీ దర్యాప్తు స్టార్ట్ అవుతోంది. ఈ కేసుల ఎపిసోడ్‌లో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఓవైపు అవినీతి, ఇంకోవైపు అనిశ్చిత వ్యాఖ్యలపై వరుస విచారణలతో ఏం జరగబోతోంది.?
సింగిల్ లైన్ ఎజెండా. అప్పటి యాక్షన్‌కు ఇప్పుడు రియాక్షన్ ఉండాల్సిందే. ఇదే లైన్‌ను ఫాలో అవుతోంది కూటమి సర్కార్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి, తమను ఇబ్బంది పెట్టిన నేతల టార్గెట్‌గా పావులు కదుపుతున్నారనేది ఓపెన్ సీక్రెట్. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా పని చేసిన వారితో పాటు పార్టీని భుజానికెత్తుకుని.. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన నేతలపై వరుస కేసులు బుక్ అవుతున్న పరిస్థితి. ఎవరికీ మినహాయింపు ఉండదన్నట్టుగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.
లేటెస్ట్‌గా మాజీ ఎంపీ విజయసాయికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రాజకీయ సన్యాసం తీసుకున్నప్పటికీ ఆయనను వదిలట్లేదన్న చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ ఇష్యూలో విచారణకు హాజరుకావాలంటూ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : తెలంగాణలో అధిక ఆదాయం రావటానికి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం- సీఎం చంద్రబాబు
కాకినాడ సీపోర్టు వాటాలను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు..
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తర్వాత నెక్ట్స్ ఎవరు? అన్న ప్రశ్నకు సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్‌తో సస్పెన్స్‌కు తెరదించినట్లు అయింది. ఇప్పుడు పోసాని తర్వాత ఉమ్మడి కృష్ణా లేదా రాయలసీమ నేతలు క్యూలో ఉండొచ్చన్న టాక్ వినిపిస్తుండగా.. ఎవరి ఊహాలకు అందకుండా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కేసు తెరమీదకు వచ్చింది.
కాకినాడ సీపోర్టు వాటాలను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలపై గతేడాది డిసెంబర్‌లో విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొన్న విజయసాయిరెడ్డికి ఇప్పుడు సీఐడీ నుంచి పిలుపు వచ్చింది.
కాకినాడ సీపోర్టు యాజమాని కేవీ రావు ఫిర్యాదుతో విజయసాయిరెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదైంది. అయితే ఈ విషయంపై దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేయడంతో కాకినాడ పోర్టు వాటాలు దక్కించుకున్న అరబిందో కంపెనీ సీపోర్టు వాటాలను వెనక్కి ఇచ్చింది. పెద్దల సమక్షంలో రాజీ కుదిరినా, కేసు మాత్రం వాపసు తీసుకోకపోవడంతో సీఐడీ రంగంలోకి దిగింది. దాంతో వైసీపీ మాజీ నేతకు ఉచ్చు బిగించేలా అడుగులు వేస్తోందని అంటున్నారు.
రాజకీయాల్లో ఉన్నా లేకున్నా వారిని వదిలేది లేదు..!
వాస్తవానికి కేసు రాజీ అయిన తర్వాత పోలీసు చర్యలు ఉండవని విజయసాయి భావించినట్లు చెబుతున్నారు. కానీ వాటాలు రిటర్న్ ఇవ్వడంతోనే ఇంకా ఇరికిపోయారన్న చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి చంద్రబాబుపై అడ్డగోలుగా మాట్లాడారని.. టీడీపీ నేతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కూటమి నేతలు చెబుతున్నారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నా లేకున్నా అడ్డగోలుగా వ్యవహరించినోళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు.
కాకినాడ సీపోర్టు కేసే కాదు.. మాజీ స్పీకర్ కోడెల కేసు కూడా..విజయసాయిరెడ్డి మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. 2019లో కోడెల శివప్రసాదరావు సూసైడ్ చేసుకున్నారు. కోడెల ఆత్మహత్య వెనక అప్పటి వైసీపీ ప్రభుత్వం వేధింపులు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. అలా రాజకీయ రచ్చ నడుస్తూ వచ్చింది. ఇంతలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది.
కోడెల కేసు విజయసాయిరెడ్డికి తలనొప్పిగా మారే అవకాశం..
అయితే కోడెల ఆత్మహత్య వెనక వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరేళ్ల క్రితం నాటి కోడెల కేసు ఇప్పుడు మళ్లీ జీవం పోసుకుని ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రాజకీయాలకు గుడ్‌బై చెప్పినప్పటికీ కాకినాడ పోర్టు వాటాల వ్యవహారం, కోడెల కేసు విజయసాయిరెడ్డికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
Also Read : ఈ రాష్ట్రంలో రౌడీలకు స్థానం లేదు, తప్పు చేస్తే తాట తీస్తా- సీఎం చంద్రబాబు వార్నింగ్
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ అవినీతి?
ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపిస్తోంది కూటమి. ఈ విషయంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగిన తెల్లారే ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఆడుదాం ఆంధ్రా కోసం గత ప్రభుత్వం రూ.120 కోట్లు విడుదల చేస్తే..అందులో మేజర్ అమౌంట్ పక్కదారి పట్టినట్లు అలిగేషన్స్ చేస్తున్నారు టీడీపీ నేతలు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టినప్పుడు ఏపీ స్పోర్ట్స్ మినిస్టర్‌గా ఆర్కే రోజా ఉన్నారు. ఆమె టర్మ్‌లోనే పెద్దఎత్తున స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ వస్తున్నారు కూటమి నేతలు. ఇప్పుడు ఏసీబీ విచారణతో రోజా చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. రోజా కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేశ్, పవన్‌పై సెటైర్లు వేయడం వంటివి గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు పెడుతూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇలా గత సర్కార్ హయాంలో చెలరేగిన వారిపై వరుస కేసులు నమోదవుతూ వస్తున్నాయి. నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూడాలి మరి.