Cm Chandrababu : తెలంగాణలో అధిక ఆదాయం రావటానికి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం- సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ వికసిత్ భారత్, నేను విజన్ 2047 అంటున్నాం. అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ఇక్కడ రూపురేఖలు మారిపోయేవి.

Cm Chandrababu : తెలంగాణలో అధిక ఆదాయం రావటానికి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం- సీఎం చంద్రబాబు

Updated On : March 11, 2025 / 8:15 PM IST

Cm Chandrababu : తెలుగు వారు ప్రపంచంలో అన్ని చోట్ల కీలకంగా పని చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. కీలక రంగాల్లో తెలుగు వారు అగ్రగామిగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో అధిక ఆదాయం రావటానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలిపారు. నేను నిత్య విద్యార్థిని, నిరంతరం నేర్చుకోవటం నాకు ఇష్టమని చంద్రబాబు అన్నారు.

నీటి లభ్యత, ఆహారం ఉత్పత్తి పెరగకుండా జనాభా పెరిగితే ఇబ్బందులు వస్తాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అందుకే జనాభా నిర్వహణ గురించి ఇప్పుడు చర్చ చేస్తున్నామన్నారు. అప్పట్లో జనాభా తగ్గుదల గురించి గట్టిగా పని చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు జనాభా పెరుగుదల గురించి మాట్లాడాల్సి వచ్చిందన్నారు. జనాభా పెంచాలనే ప్రతిపాదనతో ఇప్పుడు ముందుకు వెళ్తున్నామన్నారు.

నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నూతన భవనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రూ.700 కోట్లతో యూనివర్సిటీ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం గ్రూపు వ్యవస్థాపకులు టీఆర్ పారివేందర్, అమరావతి ఎస్ఆర్ఎం ఛాన్సలర్ సత్యనారాయణన్ పాల్గొన్నారు.

Also Read : ఈ రాష్ట్రంలో రౌడీలకు స్థానం లేదు, తప్పు చేస్తే తాట తీస్తా- సీఎం చంద్రబాబు వార్నింగ్

”ప్రధాని మోదీ వికసిత్ భారత్, నేను విజన్ 2047 అంటున్నాం. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ఇక్కడ రూపురేఖలు మారిపోయేవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు త్వరలో నిర్మాణం ప్రారంభం. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చేలా అమరావతి నిర్మాణం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విస్తరణకు అవసరమైన భూమి, నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. స్టార్టప్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎస్ఆర్ఎం ను కోరాను.

ఉద్యోగాలు చేసే వారిని కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వారిని తయారు చేయాలని సూచించా. 2047 కల్లా ప్రజల తలసరి ఆదాయం 58 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు 2.58 లక్షల తలసరి ఆదాయం మాత్రమే ఉంది. పది సూత్రాల ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.

పేదరికం లేని సమాజం కోసం పీ4 విధానం. పేదలను పైకి తెచ్చేందుకు ప్రభుత్వాలు చేసే పనులతో పాటు మీరు కూడా సహకరించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో సంపద పెరిగేలా ప్రణాళికలు. ఉద్యోగాల కల్పన చాలా ముఖ్యం. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ముఖ్యం. బ్రెయిన్ డ్రెయిన్ కు నేను వ్యతిరేకం. పని విధానంలో మార్పులు రావాలి. ఉత్పాదకత పెరిగేలా, ఫలితాలు ఉండేలా పని చేయాలి.

Also Read : గ్రూప్ 2 ఫలితాలు విడుదల.. ర్యాంకులు ఇలా చెక్ చేసుకోండి..

చదువుకున్న మహిళలు ఇంటి నుంచే పని చేసేలా ప్రణాళికలు. మగ వారి కంటే మహిళలు బాగా పని చేయగలుగుతారు. ఐటీ ఉద్యోగుల్లో మహిళలు మగవారి కంటే ఎక్కువ జీతాలు పొందుతున్నారు. టెక్నాలజీ సాయంతో వ్యవసాయం చేయాలి. సాగునీటి రంగానికి ప్రాధాన్యం. గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇంధన రంగంలో అగ్రగామిగా ఎదగాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు.