Group 2 Results : గ్రూప్ 2 ఫలితాలు విడుదల.. ర్యాంకులు ఇలా చెక్ చేసుకోండి..
పురుషుల్లో వెంకట్ హర్షవర్ధన్, మహిళల్లో లక్కిరెడ్డి వినీషా రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించారు.

Group 2 Results : తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ లో నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను టీజీపీఎస్ సీ వెల్లడించింది. గ్రూప్ 2 రిజల్ట్స్ ను టీజీపీఎస్ సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా టాప్ ర్యాంక్స్ ప్రకటించారు. పురుషుల్లో వెంకట్ హర్షవర్ధన్, మహిళల్లో లక్కిరెడ్డి వినీషా రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
పురుషులు..
సెకండ్ ర్యాంక్- వడ్లకోట సచిన్
థర్డ్ ర్యాంక్ – బీ మనోహర్
మహిళలు..
సెకండ్ ర్యాంక్ – సుస్మిత
థర్డ్ ర్యాంక్ – కప్పు శ్రీవేణి
టీజీపీఎస్ సీ అధికారిక వెబ్ సైట్ tspsc.gov.in. లో అభ్యర్థులు జనరల్ ర్యాంక్ లిస్ట్ ను చెక్ చేసుకోవచ్చు. డిసెంబర్ లో గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. 2025 జనవరిలో ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేసింది. నాలుగు సెషన్స్ లో పరీక్షలు జరిగాయి.
పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు డిసెంబర్ 15.. పేపర్ 3, పేపర్ 4 పరీక్షలు డిసెంబర్ 16న నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 1368 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. నాలుగు పేపర్ల ప్రాథమిక సమాధాన కీ, మాస్టర్ ప్రశ్నాపత్రాలను జనవరిలో అభ్యర్థి లాగిన్ ద్వారా విడుదల చేశారు. అభ్యంతరాల విండో జనవరి 18న ప్రారంభమై జనవరి 22న ముగిసింది.
Also Read : శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
* అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లాలి (https://www.tspsc.gov.in/)
* గ్రూప్ 2 సర్వీస్ జనరల్ ర్యాకింగ్ పై క్లిక్ చేయాలి
* టీజీపీఎస్ సీ ఐడీ, హాల్ టికెట్, డేటాఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేయాలి.
* పీడీఎఫ్ ఫార్మాట్ వివరాలు ఓపెన్ అవుతాయి
* ప్రశ్నాపత్రాలు, ఫైనల్ కీ కూడా అందుబాటులో ఉంది
* గ్రూప్ 2 రిజల్ట్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్
* హెల్ప్ లైన్ నంబర్ 040-22445566. ఈ నెంబర్ కు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
నెక్ట్స్ వచ్చే ఫలితాలు ఇవే..
మార్చి 14 – గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటన
మార్చి 17 – హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ రిజల్ట్స్ ప్రకటన
మార్చి 19 – ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫైనల్ రిజల్ట్స్ ప్రకటన.