×
Ad

Pawan Kalyan: ఏపీలోనే కాదు తెలంగాణలోనూ హాట్ టాపిక్..! పవన్ రూటు మారిందా..! స్ట్రాటజీ ప్రకారమే అలాంటి కామెంట్స్ చేస్తున్నారా?

వైసీసీ మళ్లీ అధికారంలోకి రానే రాదని..పదే పదే చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్. 2029లో మళ్లీ మేమే వస్తాం. అంతు తేలుస్తామంటూ చర్చకు దారి తీస్తున్నారు.

Pawan Kalyan: పవన్. ఆయన పేరుకు ముందే పవర్ స్టార్ ట్యాగ్ ఉంటుంది. అతడి మాటలు కూడా అంతే పవర్‌ ఫుల్‌. రెగ్యులర్‌గా ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ..ట్వీట్స్‌ చేస్తూ..ఏపీ పాలిటిక్స్‌లోనే కాదు..తెలంగాణలో కూడా హాట్ టాపిక్‌గా ఉంటున్నారు పవన్ కల్యాణ్. హిందుత్వ రిలేటెడ్‌ విషయాల్లో అయినా..అభివృద్ధి ఎజెండా అయినా..అపోజిషన్‌కు వార్నింగ్‌ ఇవ్వడంలో కూడా ఆయనే ముందుంటున్నారు. సేనాని రూట్‌ మారిందా? స్ట్రాటజీ ప్రకారమే పవన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేస్తున్నారా?

కొన్నాళ్లుగా ఆయన చుట్టే చర్చ. ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై డిస్కషన్. టీవీ డిబేట్ అయినా..సోషల్ మీడియా ఫ్లాట్‌ మీద అయినా..పవన్ సెంట్రిక్‌గానే చర్చ నడుస్తోంది. దానికి ఒకే ఒక్క రీజన్. పవన్ చేస్తున్న కామెంట్సే. ఈ మధ్య పవన్ మాట్లాడుతున్న ప్రతీ మాట..ఏదో విధంగా హాట్ టాపిక్ మారుతోంది. అది హిందుత్వ ఎజెండా విషయంలో అయినా..కూటమిగానే ఉంటామని చెప్తుండటం అయినా..వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని చేస్తున్న కామెంట్స్ కూడా పవన్‌ను నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తోంది. సేమ్‌టైమ్‌ అటు మంత్రి లోకేశ్‌తో పవన్‌కు గ్యాప్ అంటూ చర్చ జరిగినా..దానికి చెక్ పెట్టేలా ఆ ఇద్దరు అమరావతిలో కలుసుకోవడం..ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడం..ఇలా ఆయన చుట్టే డిస్కషన్ జరుగుతోంది.

దిష్టి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..

లేటెస్ట్‌గా పవన్ చేసిన కామెంట్స్‌ ఏపీ, తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందంటూ పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. అటు బీఆర్ఎస్..ఇటు కాంగ్రెస్ లీడర్లు పవన్ కామెంట్స్‌ను తప్పుబడుతూ విమర్శల దాడి చేశారు. పవన్ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. సారీ చెప్పకపోతే పవన్‌ సినిమాలు ఆడనివ్వబోమంటూ మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించడం హాట్ టాపిక్ అయింది.

మంత్రి పొన్నం, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ వరుస పెట్టి..పవన్ దిష్టి వ్యాఖ్యలను తప్పుబట్టారు. నాలుగైదు రోజుల పాటు సేనాని కామెంట్స్ చుట్టూ రాజకీయ వేడి కొనసాగింది. పవన్ వ్యాఖ్యలపై దుమారం లేవడంతో జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించొద్దంటూ కోరింది. ఆ తర్వాత వివాదం కాస్త సద్దుమణిగినట్లు అయింది.

హిందువులు మేల్కొనాలంటూ పిలుపు..

ఇక హిందుత్వ విషయాల్లో కూడా పవన్ తన స్టాండ్‌ను క్లియర్‌ కట్‌గా చెప్పేస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలంటూ ఇప్పటికే పలుసార్లు డిమాండ్ చేశారు పవన్. లేటెస్ట్‌గా..హిందువులు మేల్కొనాలంటూ పిలుపునిచ్చారు. దేశంలో హిందువులను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్‌..తిరుప్పరన్‌ కుండ్రంలో కార్తీక దీపం వెలిగించడంలో అడ్డంకులు పెడుతున్నారని మండిపడ్డారు. హిందువులు బలంగా నిలబడాలని ఆకాంక్షించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న హిందువులు మత విశ్వాసాల కోసం న్యాయపోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలంటూ మరోసారి పవన్ గట్టిగా డిమాండ్ చేశారు. ప్రతి హిందువు తమ దేశంలో హిందువులు ఎదుర్కొంటున్న అవమానాలపై మేల్కొనే రోజు రావాలని కోరుకుంటున్నట్లు..పవన్ ట్వీట్‌ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

వైసీపీ రానే రాదు..

ఇక వైసీసీ మళ్లీ అధికారంలోకి రానే రాదని..పదే పదే చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్. 2029లో మళ్లీ మేమే వస్తాం. అంతు తేలుస్తామంటూ చర్చకు దారి తీస్తున్నారు. 2029లో మళ్లీ పవర్‌లోకి వస్తామని కలలుకంటున్న వైసీపీకి కౌంటర్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మీరు రారు. అలాంటి ఆశలు పెట్టుకోకండి. అవి జరగవు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అంటున్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ..వైసీపీ మళ్లీ ప్రభుత్వంలోకి రాదు, రాబోదని చెప్తూ..నిత్యం పొలిటికల్ హాట్ టాపిక్‌గా కొనసాగుతున్నారు.

ఇదంతా చూసిన వాళ్లు పవన్‌ కావాలనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా? లేక ఆయన మాట్లాడిన ప్రతీ మాట చర్చకు దారితీస్తుందా? అని చర్చించుకుంటున్నారట. ఏదైనా సేనాని రూటే సెపరేటు. అధికారంలో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా ఆయన చుట్టే చర్చ జరగడం చిన్న విషయమేని కాదని..ఆయనకున్న ఇమేజ్‌, ఫ్యాన్ బేస్ అలాంటిదని మాట్లాడుకుంటున్నారు.

Also Read: LICలో 2 సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లు.. కష్ట సమయాల్లో మీకే కాదు.. మీ ఫ్యామిలీకి కూడా శ్రీరామరక్ష.. ఫుల్ డిటెయిల్స్..!