Chandrababu-Jagan
AP Legislative Council: అసెంబ్లీలో కూటమిదే కింగ్ మేకర్. ఏ బిల్లు అయినా అక్కడ ఇట్లే పాస్ అయిపోతుంది. మండలికి వచ్చేసరికి సీన్ రివర్స్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. పెద్దల సభలో వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీకి 30కి పైగా సభ్యులు ఉన్నారు. దీంతో కూటమికి మండలి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ డిబేట్స్ కూడా నువ్వానేనా అన్నట్లుగా నడుస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్‌లో మండలిలో బలపడటం మస్ట్ అని భావిస్తోందట కూటమి. ఇప్పటికే పలువురు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీలకు కండువాలు కప్పేసిన టీడీపీ అధిష్టానం..మరికొందరిని తమవైపునకు తిప్పుకునే ప్లాన్‌లో ఉందట. మండలిపై కూటమి వ్యూహమేంటి? టీడీపీ గూటికి చేరే వైసీసీ శాసన మండలి సభ్యులెవరు?
అసెంబ్లీలో ఫుల్ మెజార్టీ ఉన్నా..మండలిలో కూటమికి లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆరుగురు ఎమ్మెల్సీలు ఫ్యాన్ పార్టీని వీడినా..ఇప్పటికీ మండలిలో వైసీపీదే హవా. కూటమి సర్కార్ అసెంబ్లీలో ఏదైనా బిల్లు పాస్ చేసుకుంటే మండలిలో పాస్ అవడం కష్టంగా మారింది. లేటెస్ట్‌గా కూటమి సర్కార్ తెచ్చిన ఓ ప్రతిపాదనకు వైసీపీ షాక్ ఇచ్చింది.
పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య 2022-23 మధ్య రాజకీయంగా ఘర్షణల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయారు. వైసీపీ సానుభూతిపరులే చంద్రయ్యను చంపారన్నది అప్పట్లో చంద్రబాబు చేసిన ప్రధాన ఆరోపణ. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు గ్రూప్-2 స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వాలనుకుంది. పర్మినెంట్‌గా ఉద్యోగం కల్పించాలన్నది ప్రభుత్వం వ్యూహం.
అయితే గ్రూప్-2 స్థాయి పోస్ట్‌ను ప్రభుత్వం రెగ్యులర్ బేస్‌లో ఇవ్వడం కుదరదు. గ్రూప్-2 ఉద్యోగం ఏదైనా ఏపీపీఎస్సీ భర్తీ చేయాల్సిందే. ఈ నేపథ్యంలో చట్టాన్ని సవరించి తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనుకున్న కూటమి ప్రభుత్వం..అసెంబ్లీలో బిల్లు పెట్టింది. అక్కడ ఆమోదం పొందింది. కానీ, మండలిలోకి వచ్చేసరికి అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో మాత్రం ఈ బిల్లుకు ఆమోదం దక్కలేదు.
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చుకోవడం తప్పు కాదన్న వైసీపీ..శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వడాన్ని ప్రశ్నించింది. ఆ తర్వాత సభా సమయం ముగియడంతో ఈ బిల్లును రిజర్వులో పెట్టి మండలిని నిరవధికంగా వాయిదా వేశారు. ఇక భవిష్యత్‌లో కూడా ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది డౌటే.
లేటెస్ట్ బిల్లు ఇష్యూతో మండలిపై కూటమి సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది. ఏదైనా చేసి మండలిలో బలపడాలని..వ్యూహం రచిస్తోందట. ఏపీ శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో గవర్నర్ కోటా కలుపుకుని వైసీపీ సభ్యులు 35. టీడీపీకి 10 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు. వైసీపీ బలంగా 35 మంది ఉండగా ఆరుగురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 29కి పడిపోయినట్లు అయింది.
అయితే ఆ ఆరుగురి రాజీనామాలను ఆమోదించకపోవడంతో మండలి ఛైర్మన్ మోషెన్ రాజు తీరుపై కూటమి అసంతృప్తిగా ఉంది. ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించకపోవడంతో..ఆయనపై అవిశ్వాసానికి పావులు కదుపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సేమ్‌టైమ్ మండలిలో తమ బలం పెంచుకునేందుకు త్వరలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించి..వారిని టీడీపీలో చేర్చుకునే ప్లాన్ నడుస్తోందట. సభ్యులు రాజీనామాలు ఆమోదం పొందేలా ఒత్తిడి చేసి..ఆ తర్వాత ఖాళీ అయిన సీట్లను కూటమి కోటాలో భర్తీ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ క్రమంలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు కూటమితో టచ్‌లో ఉన్నారట. అందులో కొందరు రెన్యూవల్ కోరుతుండటంతోనే కూటమి పెద్దలు వారి చేరికపై ఆలోచిస్తున్నారట. అయితే పల్నాడుకు చెందిన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే బిల్లును వైసీపీ అడ్డుకుంటే..ఒక వైసీపీ ఎమ్మెల్సీ మాత్రం ఆ బిల్లుకు మద్దతు తెలిపారట. ఆయనే చంద్రగిరి ఏసురత్నం.
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఏసురత్నం 2019లో గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. గతంలో పోలీసు డిపార్ట్‌మెంటులో పనిచేసిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు కావడంతో టీడీపీకి మరింతగా కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే ఈ బిల్లు విషయంలో ఏసురత్నం టీడీపీకి సపోర్ట్‌గా మాట్లాడినప్పటికీ..ఆయన వైసీపీ అధినేత జగన్‌కు వీరవిధేయుడని చెప్తున్నారు.
సేమ్‌టైమ్ పలుసార్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఏసురత్నం పొగిడిన సందర్భాలు ఉన్నాయట. ఈ నేపథ్యంలో ఏసురత్నం టీడీపీలో చేరే అవకాశాలు ఎంత అన్న డిస్కషన్ నడుస్తోంది. అయితే వచ్చే సమావేశాల నాటికి..చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇప్పించే బిల్లును ఆమోదించేలా..వైసీపీ నుంచి నలుగురిని చేర్చుకుంటే..సరిపోతుందని అంచనా వేసుకుంటుందట కూటమి. మండలి సెంట్రిక్‌గా కూటమి వేసే ఎత్తులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read: బాలయ్య ఎపిసోడ్.. త్వరలో చిరుతో బాబు భేటీ? ఎందుకంటే?