Gossip Garage : యెస్. ఇట్స్ టైమ్ ఫర్ వల్లభనేని వంశీ. ఆరు నెలలుగా డైలీ ఎపిసోడ్‌గా, రేపోమాపో అరెస్ట్ అన్నట్లుగా కొనసాగిన వ్యవహారం కాస్త.. క్లైమాక్స్ వచ్చింది. ఫైనల్‌గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని కీలక సెక్షన్లు పెట్టి బుక్ చేశారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో బెయిల్ మీదున్న వంశీని..అదే కేసులో చిన్న ట్విస్ట్ ఇచ్చి మూసేశారు. టైమ్ చూసి మరీ ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా ఉన్న వంశీ ఎపిసోడ్‌ను తెరమీదకు తెచ్చారు. ఇక వాట్ నెక్స్ట్ అన్నదే ఇంట్రెస్టింగ్‌గా మారింది. వంశీ అరెస్ట్‌తో మిగతా వాళ్లలో గుబులు మొదలైందా? కూటమి సర్కార్ అసలు గేమ్ స్టార్ట్ చేసిందా?
ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హైవోల్టేజ్ హీట్‌కు చేరుకున్నాయి. అధికార కూటమి దూకుడుతో మరోసారి పొలిటికల్ వెదర్ కాక పుట్టిస్తోంది. ఎలాంటి హడావుడి, హంగామా.. లీకులు లేకుండా..తెల్లారే సరికే ఓ కీలక నేత అరెస్ట్ వార్త సంచలనం రేపింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పొద్దు పొద్దున్నే పోలీస్ కారు ఎక్కించేశారు. గత సర్కార్ హయాంలో ఓవరాక్షన్ చేశారని..ఆడ, మగ తేడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడారని.. ఆరోపణలు ఉన్న వాళ్లంతా కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయారు.
కట్ చేస్తే సడెన్‌గా ఫోకస్ వంశీ వైపు టర్న్ చేశారు..
కేసులు నమోదు అవుతుండటంతో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే రెండు మూడు నెలలుగా పెద్దగా అరెస్టులు, సర్కార్ యాక్షనేం లేకుండా పోయింది. దీంతో తమ మీదున్న కేసుల్లో ఇప్పట్లో అరెస్ట్ అయ్యే అవకాశం లేదనుకున్న వాళ్లంతా మెల్లిగా రోడ్డెక్కడం స్టార్ట్ చేశారు. కాస్త హడావుడి కూడా చేయడం మొదలెట్టారు. కట్ చేస్తే సడెన్‌గా ఫోకస్ వంశీ వైపు టర్న్ చేశారు.
నిజానికి గత ఆరు నెలలుగా వల్లభనేని వంశీ అరెస్ట్‌పై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఏ క్షణంలోనైనా వంశీని కమ్మేయడం ఖాయమన్న టాక్ వినిపించింది. కానీ టైమ్ చూసి..ఏ పొలిటికల్ హడావుడి లేని టైమ్‌లో కూటమి సర్కార్ సడెన్ షాక్ ఇచ్చిందన్న చర్చ నడుస్తోంది.
ఎన్నికల్లో ఓడిన తర్వాత కేరాఫ్ హైదరాబాద్ అయిపోయారు వంశీ. తన మీద ఫైల్ అయిన కేసులపై న్యాయపోరాటం చేస్తూ..ముందస్తు బెయిల్ తెచ్చుకుంటూ వచ్చారు. సరిగ్గా ఇదే టైమ్‌లో ఊహించని విధంగా వంశీకి ఉచ్చు బిగుసుకుంది. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వంశీ బెయిల్ మీద ఉన్నారు.
ఫిర్యాదు వాపస్ తీసుకున్న సత్యవర్ధన్‌నే తిరిగి వంశీ మీద కంప్లైంట్ చేశాడు..
అయితే టీడీపీ ఆఫీస్‌పై అటాక్ చేశారని వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే వ్యక్తి ఈ మధ్యే తన పిటిషన్ వాపస్ తీసుకున్నారట. దాంతో ఇక ఆ కేసు నుంచి రిలీఫ్ దొరికినట్లే అనుకున్నారు వంశీ. కానీ చిన్న ట్విస్ట్‌తో టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు బేస్‌గానే వంశీ కార్నర్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది. ఫిర్యాదు వాపస్ తీసుకున్న సత్యవర్ధన్‌నే తిరిగి వంశీ మీద కంప్లైంట్ చేశాడు. వంశీ తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో సీన్ మారిపోయింది.
వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను కూల్చివేత కేసులో ఏ2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై దాడి చేశారని.. హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్‌లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలు అంటూ విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతోందట. ప్రస్తుతం ఈ కేసులన్నీ ఎదుర్కొంటున్నారు వంశీ.
అయితే వంశీ అరెస్ట్‌తో రెడ్‌బుక్ అమలులో భాగంగా..అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయిందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వంశీ అడ్డగోలు కామెంట్స్ చేశారని తెలుగు తమ్ముళ్లు చాలా సీరియస్‌గా ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్‌తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను నోటికొచ్చినట్లు మాట్లాడారని..వంశీ మీద యాక్షన్ తీసుకోవాలని టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తూ వచ్చారు.
పలు సందర్భాల్లో లోకేశ్ ఈ విషయాన్ని ప్రస్తావించి సమయం వచ్చినప్పుడు..కార్యకర్తల కోరిక నెరవేరుతుంది అన్నట్లుగా చెప్పుకొచ్చారు. తన తల్లిని తిడితే ఊరుకోవాలా అంటూ శాసన మండలి వేదికగా ఇండైరెక్టుగా వంశీకి వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లోనే వంశీ అరెస్ట్ అవుతారన్న టాక్ వినిపించింది.
అయితే ఇప్పుడు టీడీపీ కార్యకర్తల వేళ్లన్నీ మాజీమంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వైపే చూపిస్తున్నాయట. వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కూడా చంద్రబాబు, లోకేశ్ ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ మీద వైసీపీ నేతలంతా చేసిన విమర్శలు ఒక ఎత్తైతే.. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు మరో ఎత్తు. వీరిద్దరి విమర్శలే అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్, టీడీపీ శ్రేణులకు ఈ ఇద్దరు మెయిన్ టార్గెట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది.
Also Read : నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో తెలీదు, ఇంకా ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు- వంశీ భార్య పంకజశ్రీ
ఇప్పుడు వంశీ అరెస్ట్ కావడంతో ఇక మిగిలింది కొడాలి నానినే అని.. ఆయన అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. కొడాలి నాని ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైపీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను తిట్టారని..ఆ మధ్య విశాఖలో ఓ యువతి కొడాలి మీద కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత కూడా అక్కడక్కడ కేసులు నమోదు అయ్యాయి.
అదే ఊపులో కొడాలి నానిని కూడా అరెస్ట్ చేస్తార్నన ప్రచారం జరిగింది. ఆ తర్వాత గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడు వంశీ ఎపిసోడ్ రావడంతో నెక్స్ట్ కొడాలి నానినే అని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. నాని మీద చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ క్యాడర్ పట్టుబడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొడాలినాని మీద కూడా ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. వంశీ తర్వాత వంతు నానిదేనా లేక ఇంకెవరి వైపు అయినా ఫోకస్ షిఫ్ట్ అవుతుందా అనేది చూడాలి మరి.