×
Ad

Nara Lokesh Vs Karnataka Ministers: లోకేశ్ వర్సెస్ కర్నాటక మంత్రులు.. మాటల యుద్ధం దేనికి.. అసలు ఈ వివాదం ఏంటి?

మేం వాటిని మర్యాదపూర్వకంగా స్వీకరించి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామంటూ ఎక్స్‌లో లోకేశ్ పోస్టు చేశారు. దీంతో..

Nara Lokesh Vs Karnataka Ministers: అక్కడ సౌకర్యాలు లేవని ఇన్వెస్టర్లు అంటారు. అయితే మీకు మా స్టేట్‌ దగ్గరే. పక్కనే అనువైన స్థలం ఉంది. రండి వచ్చేయండి. పెట్టుబడులు పెట్టండి అని లోకేశ్‌ వెల్‌కమ్‌ చెప్తారు. కట్‌ చేస్తే..లోకేశ్‌ చేసిన ట్వీట్స్‌కు..కర్ణాటక మంత్రులు హర్ట్‌ అయిపోతున్నారు. తమ స్టేట్‌ను అంటారా అంటూ..ట్విట్టర్‌లో రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఈ మాటల యుద్ధం కాస్త ఇన్వెస్ట్‌మెంట్స్‌ వార్‌గా మారుతోంది. అసలు లోకేశ్‌ ట్వీట్‌ ఏంటి? కర్ణాటక మినిస్టర్ల రిప్లై ఎందుకు? అసలు ఈ వివాదం ఏంటి?

కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల మధ్య ఆసక్తికర డైలాగ్‌వార్ నడుస్తోంది. కారణం ఏదైనా బెంగళూరులో పరిశ్రమలను రన్ చేయలేకపోతున్నామని..అక్కడి నుంచి వెళ్లిపోతామంటూ పలువురు ఇండస్ట్రియలిస్టులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఇదే అదునుగా..రండి..రండి దయ చేయండి. ఏపీలో మీకు రెడ్ కార్పెట్ వెల్‌కమ్‌ అంటూ లోకేశ్‌ చేస్తున్న ట్వీట్స్‌ ఆసక్తికరంగా మారాయి.

గతంలో కర్ణాటకలో ఏరో స్పేస్ పార్క్ ఏర్పాటుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయిస్తే నాస్కామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయా పరిశ్రమలకు ఏపీలో తగిన మౌలిక వసతులు కల్పిస్తామని, ఏపీకి రావాలంటూ మంత్రి నారా లోకేశ్ సాదరంగా ఆహ్వానించారు.

లోకేశ్ ట్వీట్ తో కర్నాటక రాజకీయాల్లో కాక..

ఇక బ్లాక్ బక్ అనే పరిశ్రమ సీఈవో బెంగళూరు రోడ్ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. తమ పరిశ్రమను బెంగళూరు నుంచి తరలిస్తామని ప్రకటించారు. బ్లాక్ బక్ సీఈవో రాజేష్ యాబాజీ చేసిన ట్వీట్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ రియాక్ట్‌ అయ్యారు. బ్లాక్ బక్ పరిశ్రమలను విశాఖపట్నానికి తరలించాలని కోరారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో కాక రేగింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే అక్కడి పరిశ్రమలు ఏపీకి తరలించాలని చూస్తున్నాయని అక్కడి విపక్షాలు సిద్దరామయ్య సర్కార్‌పై అటాక్ స్టార్ట్‌ చేశాయి.

కర్ణాటక ప్రభుత్వంతో లోకేశ్‌ నేరుగా మాటల యుద్ధం..

అప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ బ్లాక్ బక్ సీఈవో రాజేశ్ యాబాజీ ట్వీట్‌ను బ్లాక్ మెయిలింగ్‌గా అభివర్ణించారు. డీకే శివకుమార్ కామెంట్స్‌పై మంత్రి లోకేశ్ మరోసారి రియాక్ట్ అయ్యారు. ఇతర రాష్ట్రాలకు ఏపీకి ఉన్న తేడా ఇదే. మా ప్రజల ఫిర్యాదులను మేం బ్లాక్ మెయిల్ అంటూ తోసిపుచ్చబోమ్‌. మేం వాటిని మర్యాదపూర్వకంగా స్వీకరించి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామంటూ ఎక్స్‌లో లోకేశ్ పోస్టు చేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వంతో లోకేశ్‌ నేరుగా మాటల యుద్ధానికి దిగినట్లు అయింది. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మంత్రి లోకేశ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారనే దానికి ఇదో నిరద్శనమని అంటున్నారు.

ఇప్పుడు లేటెస్ట్‌గా మరో చర్చ తెరమీదకు వచ్చింది. కర్ణాటకకు చెందిన మాధ్యూఫిలిప్ అనే వ్యక్తి బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఉత్తర దిక్కువైపు ఐటీ కంపెనీల విస్తరణకు ప్రోత్సాహం ఇవ్వాలని ట్విటర్‌లో కోరారు. దీనిపై ఏపీ మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ రీట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గేను ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరు నగరానికి ఉత్తరం వైపు అనంతపురం నగరం ఉందని, అక్కడ ఐటీ, ఏరో స్పేస్ పరిశ్రమలు పెట్టేందుకు అనుకూల వాతావరణం, కావాల్సినంత భూమి ఉందని లోకేశ్ ట్వీట్ చేశారు.

కర్ణాటక ఐటీ మంత్రికి కోపం తెప్పించిన లోకేశ్ ట్వీట్..

ఇది కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు కోపం తెప్పించింది. మంత్రి లోకేశ్ ట్వీట్‌పై కర్ణాటక ఐటీ మంత్రి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలే దుమారం లేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణలో పోటీ తీవ్రరూపం దాల్చుతున్నట్లు చెబుతున్నారు. మంత్రి లోకేశ్ చొరవ, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలతో కర్ణాటకలో ఏర్పాటు చేయాల్సిన మిట్టల్ స్టీల్ విశాఖపట్నం తరలిరావాలని డిసైడ్ అయిందట.

బెంగళూరులో ఏరో స్పేస్ పరిశ్రమలకు తగిన స్థలం లేకపోవడంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ రంగానికి చెందిన పారిశ్రామిక వేత్తలు చర్చలు జరుపుతున్నట్లు టాక్. రాయలసీమలోని నాలుగు జిల్లాలు బెంగళూరు, చెన్నై మెట్రో సిటీలకు అతి దగ్గరలో ఉండటంతో రాష్ట్ర సరిహద్దుల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్‌మెంట్స్‌, కంపెనీలు తెచ్చేందుకు బెంగళూరుతో పోటీ పడుతూ లోకేశ్‌ చేసిన ట్వీట్‌తో..రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య డైలాగ్‌వార్‌కు దారితీస్తోంది.

Also Read: బాలయ్య ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయం.. కంట్రోల్ చేసే పని ఎవరికి అప్పగించారంటే..