GPS : ఆస్కార్ అవార్డులు వాళ్లకు కాదు వీళ్లకు ఇవ్వాలి- సీపీఎస్ ఉద్యోగి ఫైర్
సీపీఎస్ డ్రాఫ్ట్ ఇవ్వకుండా గైడ్ లైన్స్ అంటే ఎలా? ఉద్యోగ సంఘాలు కడుపు నిండి మాట్లాడుతున్నాయి. GPS Pension Scheme

GPS Pension Scheme
GPS Pension Scheme : జీపీఎస్ విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. సచివాలయంలో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సీఎస్ తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. జీపీఎస్ విధివిధానాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించారు. యూనియన్ల అభిప్రాయం తీసుకున్నారు. ఈ సమావేశాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. సీపీఎస్, ఉపాధ్యాయ సంఘాలు పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటున్నాయి. కాంట్రిబ్యూషన్ పై ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జీపీఎస్ లో మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయని వెల్లడించారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు వివరించారు.
ఈ సమావేశంలో సీపీఎస్ ఉద్యోగులు పూర్తి స్థాయిలో చర్చించారని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. జీపీఎస్ లో వారికి ఏం కావాలో అడిగారని చెప్పారు. పాత పెన్షన్ లో వచ్చినవి ఇవ్వాలన్నారు. అవసరమైతే పీఆర్సీని ఎక్స్ టెన్షన్ చేయాలని కోరినట్లు వెల్లడించారు బొప్పరాజు.
సీపీఎస్ డ్రాఫ్ట్ ఇవ్వకుండా గైడ్ లైన్స్ అంటే ఎలా? అని ఏపీ సీపీఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీఎం దాస్ ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు కడుపు నిండి మాట్లాడుతున్నాయని అన్నారు. సెప్టెంబర్ 1న వై నాట్ ఓపీఎస్ ఇన్ ఏపీ జరిగి తీరుతుందన్నారు సీఎం దాస్. ”ఫైల్ మీద సీఎం సంతకం కూడా అయిపోయిన తర్వాత వీరిని పిలిచారు. ఇంతవరకు గైడ్ లైన్స్ బయటపెట్టలేదు. సీఎం సైన్ అయినా డ్రాఫ్ట్ బయట పెట్టకుండా వీళ్లందరితో చర్చలు జరుపుతున్నారంటే అర్థం ఏంటి? గతలో పీఆర్సీ గురించి వీళ్లతో 12సార్లు మాట్లాడాము. వాళ్లతో మాట్లాడే రివర్స్ పీఆర్సీ ఇస్తున్నామని ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇప్పుడు జీపీఎస్ విషయంలోనూ అదే విధానం ఫాలో అవుతుంది. యదావిధిగా ఇదే జేఏసీ నాయకులు అదే వ్యవహార శైలికి వెళ్లి చప్పట్లు కొట్టి వస్తున్నారు” అని దాస్ ధ్వజమెత్తారు.
Also Read..Gannavarm : గన్నవరం రాజకీయాల్లో కీలక పరిణామాలు.. ప్లాన్ మార్చిన వైసీపీ!
జేఏసీ నేతలు చెప్పిన మాటలు తాము నమ్మబోము అని సీపీఎస్ ఉద్యోగి రాజేశ్వరరావు అన్నారు. జేఏసీ ఒకటి చెబితే అందులోని ఉపాధ్యాయ సంఘాలు మరొకటి చెబుతున్నాయని మండిపడ్డారు. ఇది ద్వంద్వ వైఖరి అని విమర్శించారు.
”జేఏసీ ఛైర్మన్ ఒక మాట చెబితే వెనుకున్న సంఘాలు కూడా అదే మాట మీద ఉండాలి. కానీ, అలా ఉండటం లేదు ఇక్కడ. జేఏసీ ఛైర్మన్ ఏమో జీపీఎస్ కు అనుకూలం అంటారు. ఆ వెనకున్న సంఘాలు.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మళ్లీ ఓపీఎస్ అంటారు. ఇది డబుల్ గేమ్. అసలు ఆస్కార్ అవార్డులు, జాతీయ చలనచిత్ర పురస్కారాలు నటులకు కాదు వీళ్లకు ఇవ్వాలి. సమస్య మాది. పోరాటం మాది. పరిష్కారం కూడా మాదే. ప్రభుత్వం మాతో మాత్రమే చర్చించాలి” అని సీపీఎస్ ఉద్యోగి రాజేశ్వరరావు మండిపడ్డారు.