Tadepalle Manipal Hospitals : 8ఏళ్ల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి.. అరుదైన ఆపరేషన్ చేసిన మణిపాల్ ఆసుపత్రి వైద్యులు

గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు.

Tadepalle Manipal Hospitals : 8ఏళ్ల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి.. అరుదైన ఆపరేషన్ చేసిన మణిపాల్ ఆసుపత్రి వైద్యులు

Updated On : September 1, 2022 / 10:26 PM IST

Tadepalle Manipal Hospitals : గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు.

ఈ క్లిష్టమైన ఆపరేషన్ ను సవాల్ గా స్వీకరించిన డాక్టర్ టామ్ చరియన్ మణిపాల్ బృందం బాలుడి తల్లి నుంచి లివర్ భాగాన్ని సేకరించింది. విజయవంతంగా ఆపరేషన్ చేసి బాలుడికి పునర్జన్మ ప్రసాదించింది. బాలుడి ఆపరేషన్ కు సాయం అందించిన సీఎంవో కు ధన్యవాదాలు తెలిపారు మణిపాల్ డైరెక్టర్ సుధాకర్.